ఇటీవల ఇలాంటి హఠాన్మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొందరు యువకులు క్రమశిక్షణ లేకుండా అకస్మాత్తుగా శారీరక శ్రమలో పాల్గొనడం, హై-ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడం, సరైన పోషకాహారం లేకపోవడం కూడా గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విధిశా జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరికీ కలచివేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన పరిణీత జైన్.. తన సోదరి వివాహంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అందరితో పాటు ఆడుతూపాడుతూ చిందులేసింది. సంగీత్ కార్యక్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక పాటను ఎంచుకుని స్టెప్పులేస్తోంది. ఇంతలోనే ఆడుతూ ఆడుతూనే హఠాత్తుగా స్టేజ్ పైనే కుప్పకూలి పడిపోయింది యువతి. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హార్ట్‌ఎటాక్ కారణంగా పరిణీత జైన్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పరిణీత మృతితో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. అయితే పరిణీతి సోదరుడు కూడా ఇలానే మృతి చెందినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే అంటే 12 ఏళ్లకే పరిణీతి సోదరుడు కూడా గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇది జరిగిన చాలా రోజుల తరువాత సోదరుడిలాగే పరిణీతి కూడా హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ అంతాఇంతా కాదు.
क्या पता मौत कभी भी आ सकती है।
— Khinyaram Bhadoo (@Kram4barmer) February 9, 2025
स्टेज पर डांस करते करते अचानक गिर पड़ी युवती और फिर हो गई मौत !! pic.twitter.com/RKeamSCGbQ