మయామిలోని న్యూడిస్ట్ ట్రావెల్ కంపెనీ అయిన బేర్ నెసెసిటీస్ నిర్వహించే బిగ్ న్యూడ్ బోట్ ట్రిప్, నార్వేజియన్ పెర్ల్ క్రూయిజ్ షిప్లో జరుగుతుంది. దీనిలో దాదాపు 2300 మంది అతిథులు పాల్గొంటున్నట్లు నివేదించబడింది. చెల్లుబాటు అయ్యే టికెట్‌తో పాటు ఈ క్రూయిజ్ ఎక్కే ప్రయాణీకులు ప్రయాణంలో బట్టలు లేకుండా ఉండాలనే తప్పనిసరి షరతు ఉంది. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన బేర్ నెసెసిటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా న్యూడ్ క్రూయిజ్ ను తీసుకువస్తోంది.
దీని ప్రధాన లక్ష్యం.. బట్టలు లేకుండా ప్రయాణాలు చేయాలని ఆసక్తి ఉండే వారికి ఒక వేదికను కల్పించడమే. ఇది పూర్తిగా వ్యక్తిగత సౌకర్యం, స్వేచ్ఛ, నమ్మకానికి సంబంధించినదని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిలో ఎటువంటి లైంగిక కార్యకలాపాలకు తావు లేదు. గౌరవం, బాడీ పాజిటివిటీ, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేస్తున్నారు. ఈ న్యూడ్ క్రూజ్ షిప్ లో చాలా రకాల థీమ్ నైట్స్, వర్క్ షాప్ లు, పార్టీలను ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో ఒకేసారి 2300 మంది ప్రయాణించవచ్చును. నార్వేజియన్ పెర్ల్ అనే షిప్ దీనికి వేదిక అవుతోంది. ఈ క్రూయిజ్ షిప్ లో 16 రెస్టారెంట్లు, 14 బార్లు, బౌలింగ్ లేన్లు, క్యాసినో, స్పా వంటి అత్యాధునిక సౌకర్యాలను ప్రయాణికులకు అందించనున్నారు. అందుకే న్యూడ్ క్రూజ్ షిప్ లో కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా అమలు చేస్తున్నారు నిర్వాహకులు. డైనింగ్ హాళ్లు, కెప్టెన్ రిసెప్షన్, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో, పోర్టుల్లో షిప్ ను ఆపినపుడు బట్టలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
అలాగే షిప్ లో కొన్ని చోట్ల నో ఫోటో జోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, డ్యాన్స్ ఫోర్లలో ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధం. ఇక బట్టలు లేకుంఆ ఉన్నారు కదాని ఎవరైనా అనుచితంగా ప్రవర్తించారో…వాళ్ళ సంగతి అంతే. ఎలాంటి రిఫండ్ లేకుండా ఎక్కడ పోర్టు వస్తే అక్కడే వారిని క్రూయిజ్ నుంచి నిర్దాక్షిణ్యంగా దింపేస్తారు.