Coronavirus: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా, 84 దేశాల్లో పెరుగుతున్న కేసులు.
Coronavirus: దాదాపు 84 దేశాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆగస్టు రెండు వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20 శాతం పెరిగిందని తెలిపింది.
అయితే కంటికి కనిపించని కరోనా.. మానవులతో తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాలను మార్చుకుంటూ.. సరికొత్త వేరియంట్లుగా అవతరిస్తూ, దాడి చేస్తోంది. ఇలా 84 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : దోమలు కొందరినే టార్గెట్ చేసి ఎందుకు కుడతాయో తెలుసా..?
కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. 2021లో కరోనా తగ్గిపోయిన తర్వాత నుంచి WHO చాలాసార్లు ఇలాంటి హెచ్చరికలు చేసింది.
ప్రతిసారీ ప్రజలు తేలిగ్గానే తీసుకుంటున్నారు. కారణం.. కరోనాను తట్టుకునే స్థితిలో తాము ఉన్నామనీ, వ్యాక్సిన్లు వేసుకున్నాం కాబట్టి ఏమీ కాదనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉంది. కానీ WHO మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు అంటోంది.
రాన్రానూ బలమైన వేరియంట్లు పుడుతున్నాయని హెచ్చరిస్తోంది. 84 దేశాల నుంచి తెప్పించిన డేటాను గమనిస్తే కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయనీ, ప్యారిస్ ఒలింపిక్స్లో 40 మంది అథ్లెట్లకు కరోనా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు వచ్చాయని WHO తెలిపింది.
Also Read : వేయించిన శనగలు తరచూ తింటుంటే చాలు, మీకు జీవితంలో గుండె జబ్బులు రావు.
ప్రస్తుతం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్లో కొత్త కరోనా వేరియంట్లు కనిపిస్తున్నాయి. వీటి వల్ల ప్రమాదం ప్రస్తుతం ఉన్న దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉండగలదని WHO అంచనా వేసింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంతవరకూ ప్రమాదం తగ్గుతుందని సూచించింది.
కరోనా తగ్గిపోయిన తర్వాత ప్రజలు వ్యాక్సిన్లు వేసుకోవడం మానేశారు. దాంతో.. ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల తయారీని ఆపేశాయి లేదా తగ్గించాయి. ఇప్పుడు మళ్లీ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరగాలని WHO కోరుతోంది.
ఎక్కడైనా సడెన్ వేవ్ వస్తే, వ్యాక్సిన్ల కొరత రాగలదు అని అంటోంది. మొత్తంగా కరోనా వదిలిపోలేదన్నది నిజం. అలాగని ఇప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇండియాలో కరోనా సమస్య లేదు కాబట్టి మనం కొంత సేఫ్ అనుకోవచ్చు. అలర్టుగా ఉంటూ, జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే.