33 ఏళ్లకే రాకేష్‌కి ఇలా జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. స్నేహితుడి మెహందీ వేడుకకు హాజరైనప్పుడు రాకేష్‌కి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
అయితే కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి నటన అద్బుతంగా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే 34 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఈ ఏడాది మే 13న గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన స్నేహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో రాకేశ్ పాల్గొన్నాడు.
అక్కడ డ్యాన్స్ చేస్తుండగా గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి చేర్పించేలోపే అతను తుదిశ్వాస విడిచాడు. కన్నడతో పాటు తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించాడు రాకేశ్ పూజారి. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్‌గా కూడా నిలిచాడు.
ఇదే క్రమంలో కాంతార 2లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అయితే సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన తర్వాతే గుండెపోటుతో కన్నుమూశాడు రాకేశ్. ఇప్పుడు కాంతార 2 సినిమాను చూసిన ఆడియెన్స్ ఈ నటుడిని చూసి ఎమోషనల్ అవుతున్నారు. కాగా రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పడం గమనార్హం.