ఆ పని కోసం కమెడియన్‌కు రూ.10 లక్షలు ఇచ్చిన శ్రీముఖి, ఆ పని ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

శ్రీముఖి అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంది కూడా. ఈ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసింది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంది శ్రీముఖి. అయితే ఈ బ్యూటీ బిగ్ బాస్ మూడో సీజన్‌లోను కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి రన్నర్ అప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత ఈ బ్యూటీకి మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా చేస్తుంది. ఇక శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్స్‌లో జబర్దస్థ్ అవినాష్ కూడా ఒకడు. వీళ్లిద్దరు చాలా సందర్భాల్లో వాళ్ల ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకున్నారు.

కాగా ఒక సందర్భంలో శ్రీముఖి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇచ్చిందని అవినాష్.. రీతూ చౌదరితో ఓ ఇంటర్వూలో చెప్పాడు. తాను బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాలంటే… అప్పటికే జబర్దస్త్‌తో ఉన్న కాంట్రాక్ట్‌ను బ్రేక్ చేసుకొని వెళ్లాలని, దాని కోసం రూ.10 లక్షలు కట్టాల్సి వచ్చిందట. అలాంటి టైమ్‌లో శ్రీముఖితో పాటు తన ఫ్రెండ్స్ హెల్ప్ చేశారని చెప్పాడు. కాగా రీతూ చౌదరీ మాట్లాడుతూ.. దాని కోసం శ్రీముఖి రూ.10 లక్షలు ఇచ్చిందట. ఇందులో నిజమెంత అంటూ ప్రశ్నించింది. దానికి అవినాష్ స్పందిస్తూ.. రూ.10 లక్షలు ఇవ్వలేదు కానీ.. రూ.5 లక్షలు ఇచ్చింది.

తన ఫ్రెండ్స్ రూ.5 లక్షలు ఇచ్చారని తెలిపింది. అయితే.. తీసుకున్న 15 రోజుల్లోనే ఈ డబ్బును రిటర్న్ ఇచ్చేశానని తెలిపాడు. అలా శ్రీముఖి, అవినాష్‌ల మధ్య ఫ్రెండ్ షిప్ ఉంటుందని అవినాష్ చెప్పాడు. ఇక నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్‌గా టర్న్ తీసుకుని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. దశాబ్దం కిందట వచ్చిన ‘జులాయి’ సినిమాలో శ్రీముఖి తొలిసారి నటించింది. అల్లు అర్జున్ చెల్లిలిగా రాజీ రోల్‌లో బాగానే మెరిసింది. అదే ఏడాది శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలోనూ ఈ స్టార్ యాంకర్ మెరిసింది.

ఆ తర్వాత ఏడాది పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో హీరోయిన్ అవతారం ఎత్తింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో శ్రీముఖి హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. అయితే ఆ తర్వాత ఏడాది ఈ బ్యూటీ తమిళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. ఇక నేను శైలజా, జెంటిల్ మెన్, భోళా శంకర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెగ బిజీగా మారిపోయింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్‌గానూ చెలరేగిపోతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *