స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేసారు. తర్వాత స్వాతిగా మార్చారు. అయితే ఒకప్పుడు టీవీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేసి.. సినిమాల్లో హీరోయిన్‌గా, హీరోయిన్ సపోర్ట్ క్యారెక్టర్‌లు చేసిన కలర్స్ స్వాతి వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. తన భర్తకు స్వాతి విడాకులు ఇవ్వబోతోందనే న్యూస్ మరోసారి హాట్ టాపిక్ అయింది.
కలర్స్ స్వాతి తన సోషల్ మీడియా అకౌంట్లలో తన భర్తతో ఉన్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేయడంతో ఒక్కసారిగా ఆమె డివోర్స్ న్యూస్ తెరపైకి వచ్చింది. నిజానికి కలర్స్ స్వాతి విడాకుల వార్తలు ఎప్పటినుంచో వస్తున్నప్పటికీ తాజాగా ఆమె చేసిన ఈ పనితో జనాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. సెలబ్రిటీల విడాకుల విషయానికొస్తే.. గతంలో సమంత, నిహారికలు కూడా ఇదే విధంగా విడాకులకు ముందు తమ భర్తలతో దిగిన ఫోటోలను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వాతి కూడా అలానే చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గతంలో కూడా కలర్స్ స్వాతి డివోర్స్ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో తన విడాకుల ఇష్యూపై రియాక్ట్ అయిన స్వాతి.. ఓ నటిగా తనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయని, అందుకే విడాకుల గురించి చెప్పను అనేసింది. 2018లో వికాస్ వాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కలర్స్ స్వాతి. ఆ తర్వాత భర్త జాబ్ రిత్యా సినిమాలకు దూరమై విదేశాల్లో కాపురం పెట్టింది.
ఆ టైమ్‌లో తన అప్‌డేట్స్, ఫ్యామిలీ జర్నీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తన భర్త వికాస్ వాసు ఫోటోలు డిలీట్ చేయడంతో వీరిద్దరి పెళ్లి వ్యవహారం విడాకులకు దారి తీసిందా అనే డౌట్స్ మళ్ళీ మొదలయ్యాయి. 37 ఏళ్ల వయసులో ఆమె విడాకులకు రెడీ కావడం అనేది చర్చనీయాంశం అయింది. పలు హిట్ సినిమాల్లో నడిచిన స్వాతి, రీసెంట్ గా పంచతంత్ర మూవీలో నటించింది.