వాలంటీర్లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. విద్యార్హతతో పాటు..!

divyaamedia@gmail.com
1 Min Read

అక్రమాలను బయటపెడుతూ వరసగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఏపీలో వాలంటీర్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు సమాచారం. అయితే, విద్యార్హతతో పాటు మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని టాక్. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమిస్తారట.

ఈ మూడేళ్లలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు సమాచారం. ఇక అటు ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట ఆర్దిక పరిస్థిని పూర్తిగా అప్పులు పాలు చేశారని నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర.

మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాలు స్వచ్చమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులుకు కోంత మంది అధికార్లు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా పని చే స్తామని స్పష్టం చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *