పాఠశాలంటే పిల్లల భవిష్యత్తుకు పునాది. అలాంటి చోట, అంతటి పవిత్ర వృత్తిలో ఉండి ఓ ప్రబుద్ధుడు నీచమైన పనిచేశాడు. అతని పాడుపనిని పిల్లలే వీడియో తీశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో చోటు చేసుకుంది. గిరిజనులు ఎక్కువగా నివసించే ఉదయ్‌నగర్ కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు చేసిన అశ్లీల పని సంచలనంగా మారింది.
అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దేవాస్‌లో ఉదయ్ నగర్ అనే గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో పని చేస్తున్న టీచర్ ఓ మహిళతో అశ్లీల పని చేశాడు. తరగతి గదిలో ఆ మహిళతో శృంగారం చేస్తుండగా.. అలాంటి అసభ్యకరమైన సంఘటనను విద్యార్థులు మొబైల్లో రికార్డు చేశారు. ఇప్పుడా వీడియో బయటకి రావడం వల్ల విద్యాశాఖ దర్యాప్తు చేపట్టింది.
అయితే బయటకి వచ్చిన ఆ వీడియో నకిలీదని సదరు ఉపాధ్యాయుడు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మొహల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఆ ఉపాధ్యాయుడు అక్కడే కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆ మహిళ తరచూ పాఠశాలకు వస్తుందని.. పాఠశాలలో విద్యార్థుల ముందే ఆ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడని అక్కడున్న వారు చెబుతున్నారు.
అయితే ఇదే విషయమై స్థానికులు ఆ ఉపాధ్యాయుడ్ని వారించారట. ఆ ఊరి సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి తనను బహిరంగంగా వీడియోపై వివరణ ఇవ్వాలని హెచ్చరించరాట. అయితే వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని.. అందులో ఉన్నది తాను కాదని బుకాయించాడు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.