సమంతతో విడాకుల అనంతరం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడిన ఈ హ్యాండ్సమ్ హీరో ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లోనే నాగ చైతన్య, శోభితలు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్ తర్వాత తమ సినిమా పనుల్లో బిజీ అయిపోయిన ఈ లవ్ బర్డ్స్ తొలిసారిగా జంటగా కనిపించారు. ఇక శోభిత ఇంట్లోనూ పసుపు దంచే కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది.
అయితే శోభితతో పెళ్లికి రెడీ అవుతున్న నాగచైతన్య తాజాగా తన మాజీ ప్రేయసీ, భార్య అయిన సమంతకు సంబంధించిన ఆ ఒక్కగానొక్క ఫోటోను కూడా తన ఇన్‌స్టా నుంచి తొలగించేశాడు. ఇద్దరు ఓ రేస్ కారు పక్కన నిలబడి ఉన్న స్నాప్‌షాట్, దీనిని చైతన్య 2018లో పోస్ట్ చేసారు, “త్రో బ్యాక్… మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్” అని పెట్టారు. తాజాగా తనతో పాటు మిగిలిన సమంత జ్ఞాపకం అయినా ఈ ఒక్క ఫోటోను కూడా చైతు డిలీట్ చేసేశాడు.
దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత సమంత నాగచతైన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో, పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే, శోభితతో నాగ చైతన్య డేటింగ్ పుకార్లు. ఆన్లైన్లో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు కనిపించడం ప్రారంభించాయి. ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం జరిగే వరకు ఇద్దరూ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది .
వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మీడియా కథనాల ప్రకారం, నాగ చైతన్య , శోభిత శీతాకాలపు డిసెంబర్ లేదా జనవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అయితే అయితే, ఈ నివేదికలను వారి కుటుంబ సభ్యులు ఎవరూ ధృవీకరించలేదు.