చూడటానికి సింపుల్ గా ఉన్న చిరంజీవి ధరించిన ఈ చెప్పుల ధర ఎంతో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

విజయవాడకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. ఇక చిరంజీవి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించారు ఈ క్రమంలోనే ఆ చెక్ అందించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. అయితే ఇటీవలే ఆ కోటి రూపాయిల చెక్ ని హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం కి వెళ్లి తన చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు కి అందించాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటోలు చూసినప్పుడు అందరి ద్రుష్టి చిరంజీవి, చంద్రబాబు నాయుడు మీద ఉంటే, కొంతమంది ఆయన అభిమానులకు మాత్రం చిరంజీవి చెప్పుల మీదకు ద్రుష్టి వెళ్ళింది. తమ అభిమాన హీరో ధరించే ప్రతీ వస్తువుని కొనాలని ఎదురు చూసే అభిమానులు, చిరంజీవి ధరించిన ఆ చెప్పులను కొనుగోలు చేసేందుకు గూగుల్ లో వెతికారు.

అయితే ఆ చెప్పుల ధర చూసిన తర్వాత అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఆ చెప్పుల ధర దాదాపుగా రెండు లక్షల రూపాయిలు ఉంటుందని గూగుల్ లో తెలిసింది. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే అలాంటి ఖరీదైన చెప్పులను కొనుగోలు చేయలేరు, కానీ బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం ఇలా డిఫరెంట్ గా అనిపించిన వాటిని కొనుగోలు చేస్తారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లకు రెండు లక్షల రూపాయిలు ఇస్తే తమ ఇంటి ఖర్చుల కోసం వాడుకుంటారు.

లేదా అదే రెండు లక్షల రూపాయలలో లగ్జరీ కావాలని కోరుకుంటే సెకండ్ హ్యాండ్ లో ఒక కారు ని కొనుక్కుంటారు. అంతే తప్ప రెండు లక్షల రూపాయిలు పెట్టి వాచీలు, చెప్పులు వంటివి కొనుగోలు చేయలేరు. ఈ చెప్పులను చిరంజీవి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడట. ఇక మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన వసిష్ఠ దర్శకత్వం లో ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *