చిరంజీవి.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్ గా వస్తూ పలు రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు కొన్నిసార్లు చిరంజీవికి ఇబ్బందులు కలిగించేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. పొలిటికల్ పరంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి.. తన తాత గురించి ఓపెన్ గా చెప్పారు.
మా అమ్మగారి తండ్రి గారైన మా తాత పేరు రాధాకృష్ణమ నాయుడు అని, ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారని అన్నారు. అంతేకాదు ఆయన మహా రసికుడు అని చెప్పి షాకిచ్చారు చిరంజీవి. ఆయనకు ఇంట్లోనే ఇద్దరు భార్యలు ఉండేవారని, బయట కూడా ఇంకో అమ్మమ్మను సెట్ చేసుకున్నారని చెబుతూనే.. తెలిసి ముగ్గురు ఉన్నారు, నాలుగు, ఐదు అకౌంట్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు అని అన్నారు మెగాస్టార్. ఆయన్ను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని ఇంట్లో వాళ్ళు చెప్పేవారని..
అసలే సినిమా ఇండస్ట్రీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మీ తాత గారిని ఆదర్శంగా తీసుకోవద్దని అనేవారని చిరంజీవి చెప్పారు. ఇకపోతే ఇదే ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఫ్యామిలీ విషయంలో చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తన ఇంట్లో అందరు అమ్మాయిలే ఉన్నారని చెబుతూ ఓపెన్ కామెంట్స్ చేశారు చిరంజీవి. ఈ మేరకు వారసుడు కావాలంటూ మనసులోని కోరిక కూడా బయటపెట్టారు చిరు.
ప్రస్తుతం వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్న చిరంజీవి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత చూస్తే శ్రీకాంత్ ఓదెల, బాబీ కొల్లి వంటి దర్శకులు క్యూలో ఉన్నారు. రీసెంట్ గానీ ఇక తన జీవితం మొత్తం సినిమాలకే అంకితం అని, ఏదేమైనా రాజకీయాల జోలికి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు చిరు.