టాలీవుడ్ లోని ప్రముఖులు అంతా చిరును ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే చిరు సెలెబ్రేటిలకు గైడెన్స్ బుక్ అయ్యాడు. ఈయన గురించి ఎంత చెప్పినా ఏదోకటి ఇంకా మిగిలే ఉంటుంది. ఎన్నో భాధలను భరించి, అవమానాలను దిగమింగుకొని ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒకటిగా ఎదిగాడు.
అయితే ఇక చిరంజీవితో ఎంతో మంది స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలనాట తారల నుంచి.. ఈ నాటి యాక్టర్‌ల వరకు.. వందల మంది చిరుతో సినిమాల్లో నటించారు. కాగా ఒక్క నటి మాత్రం.. చిరంజీవికి అక్కగా, లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించింది.
ఇంతకీ ఆ నటి ఎవరా అనుకుంటున్నారా..? ఆమె మరోవరో కాదు సీనియర్ నటి సుజాత. తెలుగు తెరపై చెదిరిపోని ముద్ర వేసుకున్న నటీమణులలో సుజాత ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో దాదాపు మూడొందలకు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి.. అక్క, వదిన, అమ్మ ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది.
1980లో కృష్ణంరాజు, చిరంజీవిలు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ప్రేమ తరంగాలు సినిమాలు సినిమాలో సుజాత.. చిరంజీవికి ప్రేయసిగా నటించింది. అంతేకాకుండా సినిమా చివర్లో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు.