ప్రజలు మళ్లీ నిర్భయంగా చికెన్ కొనుగోలు చేయడం ప్రారంభించడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో కోడి మాంసం ధరల్లో స్వల్పంగా మార్పులు నమోదవుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ‘విత్ స్కిన్’ చికెన్ కేజీ ధర రూ. 173గా ఉంది. అదే స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 196గా పలుకుతోంది. అంటే కేవలం ఒక్క వారం వ్యవధిలోనే సుమారు రూ. 50 వరకు ధర పడిపోవడం గమనార్హం.
దీని ప్రధాన కారణంగా పౌల్ట్రీ ఫార్ముల నుంచి సరఫరా పెరగడం, వాతావరణ పరిస్థితులు సహకరించడం, అలాగే వినియోగదారుల డిమాండ్ కొద్దిగా తగ్గడం వంటి అంశాలను పేర్కొంటున్నారు నిపుణులు. హోల్‌సేల్ షాపులు , రిటైల్ షాపుల్లో ఈ ధరల్లో కొన్ని తేడాలు ఉండటం సహజమే. ప్రతి ప్రాంతంలో ఒక్కో షాపు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రూ. 5 నుండి రూ. 10 వరకూ ఎక్కువ లేదా తక్కువ రేట్లు విధించవచ్చు.
కొన్ని దుకాణాల్లో బోనస్‌గా కొన్ని గ్రాములు ఎక్కువగా ఇవ్వడం కూడా కనిపిస్తోంది. అలాగే కొన్ని షాపుల్లో శుభ్రత, ప్యాకేజింగ్ లాంటి అంశాలపై ఆధారపడి ధరలు తేడా పడుతున్నాయి. గుడ్ల ధరలను పరిశీలిస్తే, ప్రస్తుతం డజన్ గుడ్లు రూ. 72 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఒక్క గుడ్డు ధర సుమారు రూ. 6. పౌల్ట్రీ ఉత్పత్తుల్లో వరుసగా వస్తున్న ధరల మార్పులు పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో మరింత ఆసక్తిగా మారుతున్నాయి.
ఇకపోతే చికెన్ తినడం ఆరోగ్యానికి పలు లాభాలను ఇస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్, ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. విటమిన్ B6, B12 హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తక్కువ కొవ్వుతో శక్తివంతమైన ఆహారం. ఆదివారం ముందు రోజు చికెన్ ధరలు దిగి రావడం సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది సండే రోజున చికెన్ లాగిస్తూ ఉంటారు.