Chicken Rate: భారీగా తగ్గిన చికెన్ ధరలు, కిలో రూ.90 మాత్రమే..!
Chicken Rate: ఒక్క కిలో మటన్ తీసుకునే బదులు.. నాలుగు కిలోల చికెన్ వస్తుందనే ఆలోచనతో ఉంటారు చాలామంది. అయితే మొన్నటి వరకు మాంసప్రియులకు చికెన్ ధరలు చుక్కుల చూపించాయి. కిలో ధర రూ.300కు పైగా పలికింది. ఆషాఢమాసంలో కేజీ చికెన్ ధర రూ.320 నుంచి రూ.340 మధ్య పలికింది. దీంతో చికెన్ ప్రియులు కేజీ తెచ్చుకునే దగ్గర అరకిలో తెచ్చుకున్నారు. కానీ, శ్రావణ మాసం మొదలు కావడంతో పరిస్థితి మారిపోయింది. కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత నెలలో విపరీతంగా పెరిగిన చికెన్ ధరలు..గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.
Also Read: విజయవాడ బస్టాండ్‌లో అర్ధరాత్రి ఆక్టోపస్ దళాల హల్‌చల్, ఏం జరిగిందో తెలిసే లోపే.?
శ్రావణ మాసం ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడడంతో చికెన్ రేట్ అమాంతం దిగొచ్చింది. ఇక ఆదివారం వస్తే..చాలామంది ముక్కలేనిది ముద్ద దిగదు అనుకునే వారు.. చికెన్ రేటు తగ్గడంతో షాపుల ముందు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ లైవ్ కోడి ధర రూ.110 నుంచి రూ.120 విక్రయిస్తున్నారు. స్కిన్ లేకుండా రూ.150 నుంచి రూ.160 ఉండగా..స్కిన్ చికెన్ ధర రూ.130 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతకొంతకాలంగా ఉన్న ధరలలో ఇదే కనిష్ట ధర కావడం విశేషం. అలాగే, హిందువులు శ్రావణమాసంలో ఎంతో నిష్టగా ఉంటారు.
Also Read: ఈనెల 21న భారత్ బంద్, స్కూల్స్, దుకాణాలు అన్నీ క్లోస్, పెద్ద ఎత్తున నిరసనలతో..!
వత్రాలు, ఉపవాసాలు ఉండడంతో నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. దీంతో చికెన్ తినే వారి సంఖ్య క్రమంగా తగ్గుమఖం పట్టింది. దీంతో చికెన్ ధరలపై ఎఫెక్ట్ పడింది. అయితే కోడిగుడ్డు ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ. 5 అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా, మటన్ ధర కేజీ రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. మరోవైపు, కోళ్లుఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని విక్రయించాల్సి ఉంటుంది. లూని సమక్షంతో వాటికి పెట్టే దాణ ఖర్చు ఎక్కువకావడంతోపాటు అనోరోగ్య బారిన పడే అవకాశం ఉంది. దీంతో మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో పాటు భారీగా కోళ్లు రావడంతో చికెన్ ధరలు అమాంతం తగ్గుముఖం పట్టాయి.