తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేగింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులు… చిరుత ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. మరోవైపు చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. అయితే తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది.
చిరుత సంచారంతో మళ్ళీ భక్తుల్లో కలవరం మొదలైంది. నిన్న రాత్రి అలిపిరి నడక దారిలో 7 వ మైలు వద్ద చిరుత కనిపించడం, చిరుత సంచారంపై భక్తులు ఆందోళన మొదలైంది. గుబురుగా ఉన్న చెట్ల మద్య ఉన్న చిరుత నడక మార్గాన్ని దాటే ప్రయత్నం చేస్తుందని భక్తులు భయంతో వణికిపోయారు. కొందరు భక్తుల కదలిక లను గుర్తించిన చిరుత శబ్దానికి అడవి లోకి వెళ్లిపోగా విషయాన్ని భక్తులు టీటీడీ సెక్యూరిటీ దృష్టి తీసుకెళ్లాడు.
దీంతో ఘటన స్థలానికి చేరుకుని చిరుత జాడ తెలుసుకునే ప్రయత్నం చేసింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యింది. చిరుత కనిపించని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను పరిశీలించింది. ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది.
అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 20 నెలలుగా నడక మార్గంలో టిటిడి అప్రమత్తంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నడక మారాల్లో నో ఎంట్రీ పెట్టింది. మరోవైపు నడక మార్గంలో భక్తులకు కర్రలు అందుబాటులోకి తెచ్చింది. టిటిడి స్వీయ రక్షణ కోసం ఊత కర్రలను భక్తులకు ఇస్తోంది.