చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్.. రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి అడియన్స్, విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ఇష్టం ఉంటుంది. నాగార్జున విదేశాలకు వెళ్తే కాఫీ పౌడర్ కొంటాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ష్యూస్ ఎక్కువగా తీసుకుంటాడు. అలాగే రామ్ చరణ్‌కు కూడా ఓ అలవాటు ఉంది.
ఆయనకు వాచీలు అంటే చాలా యిష్టం. ఆయన దగ్గర ఉన్న వాచీల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మెగా వారసుడి దగ్గర 7 అత్యంత ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం 10 లక్షల కంటే పైన.. అత్యధికంగా కోటి వరకు ఉన్న వాచ్‌లు కూడా ఈయన దగ్గరున్నాయి. ముఖ్యంగా చేతి వాచీల కలెక్షన్ అంటే రామ్ చరణ్‌కు చాలా యిష్టం. ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నీ ఈయన దగ్గర ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా కూడా రామ్ చరణ్ ముందుగా కొనేది వాచ్. లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా యిష్టపడుతుంటాడు రామ్ చరణ్.
అంతేకాదు తనకు నచ్చిన వాళ్లకు కూడా గడియారాలనే గిప్టులుగా ఇస్తుంటాడు మెగా వారసుడు. పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్: ఈ ఇంపోర్ట్ వాచ్ ధర 68 లక్షలు.. ఇండియాకు తీసుకురావడానికి కోటి వరకు ఖర్చు అయ్యుంటుందని అంచనా.. రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029: 85 లక్షలు కేవలం వాచ్ కోసం ఖర్చు పెడితే దాని ట్యాక్సులు కలిపి కోటిన్నర వరకు అయ్యుంటుందని అంచనా.. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్: ఈ వాచ్ కోసం కూడా 75 లక్షల వరకు ఖర్చు చేసాడు.
ట్యాక్సులతో కలిపి కోటి వరకు ఈ వాచ్ ఉంటుంది.. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ లెబ్రాన్ జేమ్స్: కంపెనీ సేమ్ అయినా కూడా అందులో మరో ఖరీదైన వాచ్ ఇది.. దీని విలువ 43 లక్షలు.. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ నేవి బ్లూ: ఇది కూడా సేమ్ కంపెనీ కాకపోతే డిఫెరెంట్ వాచ్.. రేట్ 22 లక్షలు రోలెక్స్ యాక్ట్ మాస్టర్- 2: రామ్ చరణ్ దగ్గర ఉన్న తక్కువ ఖరీదు చేసే వాచ్ ఇదే.. దీని విలువ 13 లక్షలు, అయితే ఇటీవల ఓ వెకేషన్ లో చరణ్ అద్భుతమైన రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 ధరించి కనిపించాడు.
క్లిష్టమైన జిగ్సా పజిల్-ప్రేరేపిత డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన ఈ స్విస్ వాచ్ తెలుపు, గులాబీ, పసుపు బంగారు రంగులలో లభిస్తుంది. ది ఇండియన్ హోరాలజీ ప్రకారం.. ఈ ప్రత్యేకమైన టైమ్‌పీస్ మార్కెట్ ధర పడిపోయే రూ. 2.19 కోట్లు! ఈ విషయం తెలిసి ఈ ధరతో హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.