“గేమ్ చేంజర్ ” డిజాస్టర్ అవడంతో తీవ్రంగా నష్టపోయామని అసలు తమ బ్యానర్ మూసుకోవాల్సి వస్తుందేమో అన్నంతస్థాయిలో నష్టాన్ని ఎదుర్కొన్నామని శిరీష్ రెడ్డి ఇటీవల కామెంట్స్ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల గ్యాప్లో రిలీజ్ అయిన “సంక్రాంతికి వస్తున్నాం ” హిట్ కావడంతో తాము తేరుకున్నామని ఆ క్రెడిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడిదేనని అన్నారు.
అయితే కోట్ల రూపాయలు నష్టపోయామని.. అయినా రామ్ చరణ్ కానీ, దర్శకుడు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. హీరో లేదా దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అని అన్నారు. అలాగే ఈ మూవీ నిర్మాతల్లో మరొకరు అయిన దిల్ రాజు సైతం పలు ఇంటర్వ్యూల్లో ‘గేమ్ ఛేంజర్’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పాల్గొన్న ప్రతి ఈవెంట్, ఇంటర్వ్యూల్లోనూ ఈ సినిమా గురించే ప్రస్తావన తేవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇంకో సారి గేమ్ చేంజర్ గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటన ప్రకారం.. ‘‘ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక!. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికి తెలుసు.
మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకొనే మీరు.. ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికి అపాదించడం ఎంతవరకు సమన్యాసం.
ఖబడ్దార్ అంటూ హెచ్చరిక జారీ చేసిన రామ్ చరణ్ అభిమానులు.. ఇంకో సారి గేమ్ చేంజర్ గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.. – రామ్ చరణ్ ఫ్యాన్స్.. pic.twitter.com/Y8EOssN800
— H A N U (@HanuNews) July 1, 2025