WHO అలెర్ట్, దేశంలో విజృంభిస్తున్న మరో వైరస్, అప్పుడే 80 మందికి పైగా మృతి.

divyaamedia@gmail.com
2 Min Read

చాందీపురా వైరస్‌ సోకితే తీవ్ర జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యవిభాగం డాక్టర్‌ సుభాష్‌ గిరి చెబుతున్నారు. చాందీపురా మెదడును ప్రభావితం చేస్తుంది. అయితే డెంగ్యూ బాధితుల్లో శ్వాస తీసుకోవడంలో ఎటువంటి సమస్య ఏర్పడదు. డెంగ్యూ జ్వరం వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుంది. అయితే చాందీపురా వైరస్ బాధితులు మాత్రం ఎక్కువగా పిల్లలలో ఉన్నారు. అయితే గత 20 ఏళ్లలో తొలిసారిగా భారతదేశంలో అత్యధికంగా చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. WHO ప్రకారం జూన్ ప్రారంభం నుంచి ఆగస్టు 15 మధ్య, భారతదేశంలో 82 మరణాలతో సహా మొత్తం 245 వైరస్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇంతకు ముందు కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయని..

అయితే గత 20 ఏళ్లలో ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీన్ని బట్టి ఈ ఏడాది చండీపురా వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. చండీపురా వైరస్‌ను CHPV అంటారు. ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని కేసులు భారతదేశంలోని పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాకాలంలో వస్తూ ఉంటాయి. ఈ ఏడాది గుజరాత్‌లో తొలిసారిగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. చండీపురా వైరస్ సోకిన ఈగలు, దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. పిల్లలలో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి నిర్దిష్ట చికిత్స లేదా టీకా అందుబాటులో లేదు. రోగికి లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు.

చండీపురా వైరస్ మరణాల రేటు కరోనా కంటే చాలా రెట్లు ఎక్కువ. కరోనా మరణాల రేటు 2 శాతం. అంటే 100 మంది సోకిన రోగులలో కేవలం ఇద్దరు రోగులకు మరణించే ప్రమాదం మాత్రమే ఉంది. అయితే చండీపురా వైరస్ విషయంలో ఈ సంఖ్య 50 నుండి 75 శాతం వరకు ఉంటుంది. భారతదేశంలో 245 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి గురించి అంచనా వేయవచ్చు. బాధితుల్లో 82 మంది చనిపోయారు. చండీపురా వైరస్ చాలా సందర్భాలలో పిల్లలలో సంభవిస్తుంది. దీని బారిన పడిన తర్వాత క్రమంగా మెదడుపై ప్రభావం చూపుతుంది. మెనింజైటిస్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధి సోకిన 48 నుండి 72 గంటల మధ్య చికిత్స అందకపోతే… రోగి మరణం సంభవించవచ్చు.

ఈ వైరస్ వల్ల ఎక్కువగా మరణాలు మెనింజైటిస్ వల్ల సంభవిస్తాయి. జూలై 19 నుంచి చండీపురా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని.. అయితే దీని విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని WHO పేర్కొంది. ఎందుకంటే వర్షం తర్వాత దోమలు, ఈగలకు సంబంధించిన వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వైరస్ వీటి ద్వారా వ్యాపిస్తుంది కనుక అప్రమత్తంగా ఉంటూ నివారణపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వ్యాధి సోకిన వ్యక్తుల నమూనాలను సకాలంలో పరీక్షించి నివేదించాలి. దీంతో నిర్ణీత సమయంలో రోగికి చికిత్స అందుతుంది. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే వైరస్ కారణంగా మరణాల సంఖ్యను తగ్గించవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *