నాగచైతన్య పెళ్లికి పట్టుమని 15 రోజుల సమయం లేదు. డిసెంబర్ 5న శోభిత దూళిపాళతో ఆయన ఏడు అడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు శోభితకు కోడలు హోదా ఇచ్చింది అక్కినేని కుటుంబం. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరు త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇక వచ్చే నెల 4న ఇద్దరి పెళ్లి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.
అయితే ఇప్పటివరకు వీరి వివాహం గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ చైతూ, శోభితా వివాహ ఆహ్వానా పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా వీరిద్దరి పెళ్లిపై నాగార్జున స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. చైతూ కోరినట్లుగానే తన పెళ్లిని చాలా సింపుల్ గా చేయాలనుకుంటున్నామని అన్నారు. “ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది.
మా నాన్నగారి శతజయంతి వేడుక నిర్వహించాము.. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ, శోభితా వివాహం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్ గా చేయాలని కోరాడు. అందుకే మా కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో కలిసి 300 మందిని పిలవాలనుకున్నాము. స్టూడియోలోనే అందమైన సెట్ లో వీరి పెళ్ల జరగనుంది.
అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చూసుకుంటామని అన్నారు ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సనీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుతం చైతన్య డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది.