సమంత రెండో పెళ్లి తర్వాత.. నాగచైతన్య సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్.

divyaamedia@gmail.com
2 Min Read

నాగ చైతన్య శోభిత కంటే ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చైతన్య, సమంత కలిసి ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆతర్వాత కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.

అయితే అనుకోని కారణాల వల్ల సమంత, నాగచైతన్య విడిపోయారు. తాజాగా రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది సమంత. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. కాగా, సమంత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నాగచైతన్య, సమంత విడాకుల వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి చాలా మంది సమంతను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నాగచైతన్య మంచివాడని, సమంత కారణంగానే విడాకులు జరిగాయని కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏది ఏమైనా వారిద్దరూ విడిపోయారని, ఇక ఈ చర్చ అనవసరమని చాలా మంది కామెంట్లు చేశారు.

అయితే, సమంత రెండో పెళ్లి చేసుకున్న సమయంలో ఈ చర్చ మరోసారి మొదలైంది. చైతన్య మంచివాడని, ఫ్యామిలీ మ్యాన్‌ 2 నుంచే సామ్ రిలేషన్‌లో ఉన్నందున చై, సామ్ మధ్య వివాదం మొదలై విడాకుల వరకు వెళ్లిందనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. ఇక, ఈ ట్రోలింగ్స్ కొనసాగుతున్న సమయంలో నాగచైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. తాను నటించిన వెబ్ సిరీస్ దూత విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

ఈ సందర్భంగా ఆ సిరీస్ ని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు చై. ‘ఒక నటుడిగా విభిన్నంగా, నిజాయితీగా కథను ఎంపిక చేసుకుని, ఉత్తమమైన నటన కనబరిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని నిరూపించిన సిరీస్ దూత. సినీ ప్రేమికులు ఆ ఎనర్జీని తీసుకుని మళ్లీ తిరిగి ఆ నటుడికి అంతే బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తారు. దూత రిలీజ్ అయ్యి రెండేళ్లు అయ్యింది. దానిని సాధ్యం చేసిన టీమ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పాడు నాగచైతన్య.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *