చైతన్య… తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోకు వెళ్లాడు. ఈ షోలో.. తన లైఫ్లో జరిగిన జరుగుతున్న చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే శోభితతో తన రిలేషన్ ఎలా మొదలైందో చెప్పిన చై… తన కారణంగా శోభిత విమర్శల పాలైందంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తనకు శోభతకు గతంతో ఎలాంటి సంబంధం లేదని.. అయినప్పటికీ తమకు సంబంధం అంటగట్టి దారుణంగా విమర్శించారని చెప్పాడు. అయితే తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో సమంతతో విడాకులపై కుండబద్దలు కొట్టారు నాగ చైతన్య. తమ బ్రేకప్ విషయం చెబుతూ రహస్యాలు వెల్లడించారు.
ఒక బ్రేకప్ జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది నాకు తెలుసు.. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే. ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు.. ఈ నిర్ణయం తీసుకునేముందు వెయ్యి సార్లు ఆలోచించాం, పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని అన్నారు నాగ చైతన్య. అసలు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది.. ఏం జరిగినా దానికంటూ ఓ బలమైన రీజన్ ఉంటుంది కదా అంటూ డివోర్స్ పై నాగ చైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య ఆమెతో నాలుగేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రీసెంట్ గా నటి శోభిత దూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే నాగ చైతన్య లేటెస్ట్ సినిమా తండేల్ ప్రేక్షకుల ముందుకొచ్చి తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదలై, అన్ని ఏరియాల్లో సత్తా చాటుతోంది. నాగ చైతన్యకు ఇది కెరీర్ బెస్ట్ మూవీ అంటున్నారు సినీ విశ్లేషకులు.
బన్నీ వాస్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగా ప్లస్ అయింది. నాగ చైతన్య- సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో తెగ సంబర పడుతున్నారు.