కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించిన ఓ వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ భయానక పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు వస్తోంది. ఇలాంటి తరుణంలో చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చిందన్న వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. HKU5-CoV-2 వైరస్ వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.
అయితే చైనాలో కరోనా వైరస్‌ను పోలిన మరో వైరస్‌ను శాస్త్రేవేత్తలు కనిపెట్టారు. దీని పేరు HKU5-CoV-2. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరమైందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కోవిడ్-19కి కారణమైన SARS-CoV2ని పోలీ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్‌కు సంబంధించిన విషయాలను హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక తెలిపింది.
గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనలో గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు పాల్గొన్నారు. వారి పరిశోధనలు మంగళవారం పీర్ రివ్యూడ్ జర్నల్ సెల్‌లో ప్రచురించారు. కొత్తగా కనిపెట్టిన ఈ వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS) వైరస్‌ను కలిగి ఉండే మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందింది.
ఇది హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటిగా గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనో వైరస్ కొత్త రూపం. ఇది నేరుగా లేదా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నాు. అయితే కరోనా అంత తీవ్రమైన ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. ఏది ఏమైనా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూ మనుషులు జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ తాజా అధ్యయనాలతో మరో కొత్త వైరస్ భయం ప్రజలను పట్టుకుంటుంది.