మీ ఎటిఎం లేదా క్రెడిట్ కార్డ్ పోయిందా..? వెంటనే ఈ పని చేయండి. లేదంటే భారీ నష్టం తప్పదు..!

divyaamedia@gmail.com
2 Min Read

డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా, కొన్నిసార్లు అవి పోయినట్లయితే వాటిని వెంటనే బ్లాక్ చేయడం మంచిది. అయితే, ఇప్పుడంటే యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి కానీ.. చదువురాని వారు, అవసరం ఉన్న వారు ఏటీఎం కార్డులనే ఎక్కువగా వాడుతుంటారు. అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం, చోరీకి గురవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది.

అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా ఏటీఎంను చోరీ చేసిన వాళ్లు అందులోని డబ్బులు కాజేస్తుంటారు. అందుకే.. ఏటీఎం దొంగిలించినా.. పోగొట్టుకున్నా వెంటనే బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు బ్యాంకర్లు. ఏటీఎం కార్డును బ్లాక్ చేసే మార్గాలివే.. నెట్ బ్యాంకింగ్, యాప్: మీ ఏటీఎం కార్డ్ ఎప్పుడైనా దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా.. వెంటనే మీ నెట్ బ్యాంకింగ్ లేదా యాప్ నుండి ఒక క్లిక్‌తో బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

మీరు నెట్ బ్యాంకింగ్‌ లాగిన్ చేసి డెబిట్ కార్డ్ బ్లాక్/తాత్కాలిక బ్లాక్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. వినియోగదారుల సహాయ కేంద్రం/కస్టమర్ కేర్: మీ ఏటీఎం కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా.. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి బ్లా్క్ చేయించొచ్చు. అయితే, మీరు మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు మాత్రమే కాల్ చేయాలి. ఈ ఐవీఆర్ లో ఏటీఎంను బ్లాక్ చేసే ఆప్షన్‌ను పొందుతారు. తద్వారా పోయిన కార్డును బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ మరో సదుపాయం కూడా ఉంటుంది. చాలా బ్యాంకులు ఏటీఎం కార్డుల వెనుకాలే ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తాయి. దానికి కాల్ చేసి కూడా మీ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.

అందుకే.. ఏటీఎం కార్డు వెనుక రాసి ఉన్న నెంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మెసేజ్ పంపడం: ప్రతి బ్యాంకు తమ ఖాతాదారులకు మెసేజింగ్ సౌకర్యం కల్పిస్తుంది. తద్వారా ఏటీఎం వినియోగదారులు తమ కార్డును కోల్పోతే.. వెంటనే మెసేజ్ పంపి బ్లాక్ చేయవచ్చు. అయితే, ఇందుకోసం మీరు మీ బ్యాంకు నంబర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ సూచనల మేరకు ఆ నంబర్‌కు మెసేజ్ పంపాలి. కాసేపటి తరువాత కార్డ్ బ్లాక్ అవుతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *