కేబుల్ టీవీలో అశ్లీల వీడియోలు, అవాక్కైన ప్రేక్షకులు. ఆ తర్వాత ఏం చేసారో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా అశ్లీల దృశ్యాలు ప్రసారం కావటం సంచలనంగా మారింది. ఆ వీడియోలను చూసినవారు వెంటనే ఛానల్ నిర్వహకులకు విషయం తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన ఛానల్ సిబ్బంది వీడియో ప్రసారాన్ని నిలిపివేసారు. అయితే టెలివిజన్‌ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉపకరణం. వినోదం కోసం ఏర్పాటుచేసుకునే టీవీలో అనూహ్యంగా అభ్యంతకర రీతిలో అసభ్య వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. కుటుంబసభ్యులు అంతా కలసి చూస్తున్న సమయంలో అనూహ్యంగా ప్రత్యక్షమైన అశ్లీల వీడియోతో ఇబ్బందులు పడ్డారు. ఇలా ఒక్కసారి కాదు రెండు కాదు పలుమార్లు అశ్లీల వీడియోలు ప్రసారమవుతుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నందికొట్కూరులో చోటుచేసుకుంది. నందికొట్కూరు పట్టణంలో ఫిరోజ్ డిష్ కేబుల్ సర్వీసు ఉంది. పట్టణంలో వీరి డిష్‌ టీవీని సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న ఇళ్లకు టీవీ ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల టీవీలో ప్రసారాలు చూస్తుండగా అనూహ్యంగా అశ్లీల దృశ్యాలు వచ్చాయి. నీలి చిత్రాలు దాదాపు కొన్ని నిమిషాల పాటు ప్రసారమయ్యాయి. సినిమా చూస్తున్న క్రమంలో ఇలాంటి వీడియోలు రావడంతో కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వెంటనే టీవీని ఆఫ్‌ చేశారు.

మరికొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అశ్లీల చిత్రాలు ప్రసారం చేసిన డిష్‌ నిర్వాహకులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో నందికొట్కూరు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పరిటాలకు చెందిన ఫైబర్ నెట్ నిర్వాహకుడు ఫిర్యాదులో వాస్తవం ఏం జరిగిందో వివరించారు. ఉదయం పూట సినిమా చూస్తుండగా మధ్యలో 30 నిమిషాలు నీలి చిత్రాలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ దృశ్యాలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు.

దసరా సెలవులతో ఇంటిల్లిపాది టీవీ చూస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. అయితే ఒకరి నిర్వాకం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఆదరిస్తున్న ఈ డిష్‌ కేబుల్‌లో ఇలాంటివి రావడం మొదటిసారని పేర్కొంటున్నారు. కాగా టీవీల్లో అశ్లీల ప్రసారాల వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రీతిలో స్పందిస్తున్నారు. ‘సొళ్లు కార్చండి’ అంటూ కొందరు తెలుపుతుండగా.. ‘అరె ఏంట్రా ఇది’ అని కామెంట్‌ చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *