అచ్చం బుమ్రా లా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి. ఎలా బౌలింగ్ చేస్తుందో మీరే చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

ఓ యువతి అచ్చం బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బంతులు సంధించింది. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అమ్మాయి బుమ్రా సిగ్నేచర్ స్టైల్‌ను అచ్చుగుద్దినట్లుగా దింపేసింది. బుమ్రా మాదిరిగానే తక్కువ రన్-అప్, వేగంగా చేయి కదలిక, విడుదల వంటి ట్రేడ్‌మార్క్‌ స్టైల్‌ను సదరు యువతి ఫాలో అయింది. అయితే బెంగళూరుకు చెందిన ఓ స్కూల్ గర్ల్ అచ్చం బుమ్రా మాదిరిగా బౌలింగ్ చేస్తూ ఫేమస్ అయిపోయింది. స్కూల్ డ్రెస్​లోనే గ్రౌండ్​కు వచ్చిన ఆ అమ్మాయి.. చేతికి బాల్ అందుకొని రనప్ మొదలుపెట్టింది.

బుమ్రా మాదిరిగా పరిగెత్తుకుంటూ వచ్చి అతడి స్టైల్​లోనే బాల్​ను రిలీజ్ చేసి బ్యాటర్ వైపు సంధించింది. పిచ్​పై పడిన బంతి అంతకంటే వేగంగా బ్యాటర్ వైపు దూసుకెళ్లింది. బాల్ చేతిలో పట్టుకున్న తీరు దగ్గర నుంచి రనప్, ఫుట్ ల్యాండింగ్, హెడ్ పొజిషన్ అన్నీ టీమిండియా స్పీడ్​స్టర్​ను పోలి ఉన్నాయి. ఆమె జంప్ చేసిన తీరు కూడా అదే. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఆమె బుమ్రా సోదరిలా ఉందని అంటున్నారు.

లేడీ బుమ్రా బౌలింగ్ సూపర్బ్​గా ఉందని.. అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. అచ్చం బుమ్రా మాదిరే బౌలింగ్ చేస్తున్న ఈ అమ్మాయి.. ఫ్యూచర్​లో టీమిండియాకు ఆడి అతడిలాగే నంబర్ వన్ బౌలర్​గా ఎదగాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఆమె పట్టుదల చూస్తుంటే ఆ స్థాయికి చేరుకుంటుందనే నమ్మకం ఉందని అంటున్నారు. ఆమెను సెలెక్ట్ చేసి సరైన ట్రైనింగ్, గైడెన్స్ ఇస్తే వరల్డ్ నంబర్ వన్ బౌలర్​గా మారుతుందని చెబుతున్నారు.

ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకురావాలని.. తన టాలెంట్​ను భారత క్రికెట్​ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక, ఆ లేడీ బుమ్రా పేరు మైరా జైన్ అని తెలుస్తోంది. ఆమె బౌలింగ్ వేసిన వీడియోతో పాటు బ్యాటింగ్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నిల్చున్న చోటు నుంచే అలవోకగా భారీ షాట్స్ కొడుతూ కనిపించింది మైరా. మరి.. ఈ లేడీ బుమ్రా.. రియల్ బుమ్రా రేంజ్​లో సక్సెస్ అవుతుందా? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *