2025 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్ ను ఫ్రీడమ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ ప్లాన్ ను రెగ్యులర్ గా డేట్ అప్డేట్ చేస్తూ నవంబర్ 15వ తేదీ వరకు పెంచుతూ వచ్చింది. అయితే, నవంబర్ 15 నుంచి ఈ ఆఫర్ ప్లాన్ ని నిలిపివేసింది.
అయితే తాజాగా కొత్త కస్టమర్లను తెచ్చుకునేందుకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులోకి తెచ్చింది. అందేంటి అంటే రూ.1 ఫ్రీడమ్ ప్లాన్. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆ తర్వాత దీపావళి సందర్బంగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరోసారి అదే ఆఫర్‌ను తీసుకొచ్చింది.
డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా సిమ్ తీసుకునేవారికి ఇది వర్తించనంది. సిమ్ ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.1కే ఒక నెల రీచార్జ్ వస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పంపుకునే సౌకర్యం లభిస్తుంది. ఎక్కువమంది ఈ ప్లాన్‌ను కోరుకోవడంతో తిరిగి తెచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో స్పష్టం చేసింది.
ఇటీవల బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా.. అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు . ఇక రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు.
Back by public demand – BSNL’s ₹1 Freedom Plan!
— BSNL India (@BSNLCorporate) December 1, 2025
Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.
Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2
