ఎక్కువ మందికి రాత్రిపూట బ్రష్ చేసుకునే అలవాటు ఉండదు. అలాంటి వారిలో కొందరికి ఉదయాన్నే నోరు దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు రాత్రి పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొంతమందిలో ఉదయాన్నే నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇది చాలా సాధారణ సమస్య. నోటి దుర్వాసన అనేది సాధారణంగా మీరు తీసుకునే ఆహారం, పానీయాల వల్ల వస్తుంది. తిన్న పళ్లల్లో ఇరుక్కుపోవటం, రాత్రంతా నోటిలో ఉండిపోవటం కారణంగా అవి దుర్వాసనను కలిగిస్తాయి.
నోటిలో ఉండిపోయిన ఆహారంతో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది. అయితే విటమిన్ సి.. విటమిన్ సి.. మన చిగుళ్లు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపం ఉంటే… చిగుళ్ల వాపు రావడం, రక్తస్రావం, బాక్టీరియాకి కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి.. ఉసిరి, జామ, కివి, ఆరెంజ్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. విటమిన్ డి లోపం – ఈ విటమిన్ ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.

విటమిన్ డి లోపం దంతాలు బలహీనపడటానికి, దంత క్షయం ప్రమాదాన్ని పెంచడానికి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ఇది దుర్వాసనకు దారితీస్తుంది. పుట్టగొడుగులు,కోడి గుడ్డు, ఆవు పాలు, పెరుగు, సోయా పాలు , సోయా ఉత్పత్తులు వంటి విటమిన్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చండి. విటమిన్ బి 12 లోపం – విటమిన్ బి 12 లోపం నోటి పూతకు కారణమవుతుంది. జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఆహారంలో వీలైనంత ఎక్కువగా తెలుపు లేదా ఎరుపు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహారాన్ని తినండి.
విటమిన్ ఎ లోపం – విటమిన్ ఎ లోపం నోరు , గొంతులో తేమను తగ్గిస్తుంది. నోరు పొడిబారడం, నోటి దుర్వాసనను పెంచుతుంది. ఫోలిక్ ఆమ్లం (విటమిన్ బి 9) లోపం – దీని లోపం చిగుళ్ళను బలహీనపరుస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ఇది దుర్వాసనకు దారితీస్తుంది. యాలకులు, దాల్చిన చెక్క.. నోటి దుర్వాసనను నివారించడానికి, యాలకులు, చిన్న దాల్చిన మొక్కను నలిమిలితే సరిపోతుంది. మీ నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మీ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

మీ నోటి దుర్వాసనను నివారిస్తుంది. బిర్యానీ ఆకుతో టీ… దుర్వాసనను తక్షణమే వదిలించుకోవడానికి బిర్యానీ ఆకు టీ తాగండి. నాలుగు బిర్యానీ ఆకులను నీటిలో కొన్ని నిమిషాలు మరిగించి, ఆపై దానిని వడకట్టి త్రాగండి. మీరు రెగ్యులర్ గా దనియాలు, తులసి ఆకులు నమిలినా కూడా దుర్వాసన క్రమంగా తగ్గుతుంది.
