పెళ్లి పీటలెక్కనున్న ‘బ్రహ్మముడి’ హీరోయిన్. ఎవరితోనో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

హీరో నాగచైతన్య, శోభిత ప్రేమించుకొని పెళ్లి చేసుకోగ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇలా వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా బుల్లితెర నటీనటులు కూడా వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నారు. అలా ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన దీపిక రంగరాజు గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న టీవీ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి.

బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్, దీపిక రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ సీరియల్ తో మానస్ కు ఎంత పేరొచ్చిందో దీపికకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటమ్మాయిలా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది దీపిక. ఇక టీవీషోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో వచ్చిరానీ తెలుగుతో దీపిక చేసే సందడి మాములుగా ఉండదు.

ఇలా తెలుగు బుల్లితెరపై జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న దీపిక న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది. అదేంటంటే.. దీపిక మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట. ఓ సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉందట. అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట. వారు కూడా ఒకే చెప్పారట. దీంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు కావ్య రెడీ అవుతోందట. ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అటు దీపిక కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు.

అలాగే కావ్య మెడలో బ్రహ్మముడి వేసే ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా? అన్నది చాలామంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌‌ తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్రహ్మముడిలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. తమిళంలో ఓ సినిమాలోనూ నటించిందీ ముద్దుగుమ్మ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *