మీకు పెర్​ఫ్యూమ్ వాడే అలవాటు ఉందా..? మీకు పిల్లలు పుట్టే అవకాసం లేనట్లేనా..!

divyaamedia@gmail.com
2 Min Read

నిత్యం సెంటు కొట్టుకునే వారికి.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఓ పరిశోధన తేల్చింది. ఏకంగా సంతానలేమి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రసాయనాల ప్రభావం..బాడీ స్ప్రేలు, పెర్ఫ్యూమ్స్‌లో తరచుగా ఉండే పారాబెన్స్ ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వీటిని ఎక్కువ కాలం పాటు చర్మంపై నేరుగా ఉపయోగించడం వల్ల శరీరం ఈ రసాయనాలను పీల్చుకుని తక్కువ మోతాదులోనైనా హానికరమైన ప్రభావాలను కలిగించే అవకాశం ఉంది. పురుషుల ఆరోగ్యంపై ప్రభావం..పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే ముఖ్యమైన హార్మోన్‌ ను ప్రభావితం చేయగల గుణం ఈ రసాయనాల్లో ఉంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గిపోతే స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతపై దెబ్బ పడుతుంది.

దీర్ఘకాలికంగా ఇది సంతానలేమికి దారి తీసే అవకాశముంది. డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఇటీవల ఇలా హార్మోన్ మార్పుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న యువకుల సంఖ్య పెరుగుతుందని పరిశోధనలో తేలింది. మహిళల ఆరోగ్యంపై ప్రభావం.. పురుషులకే కాదు.. మహిళల్లో కూడా ఈ రసాయనాల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో ఈ పదార్థాలు పాత్ర వహిస్తాయి. ఇది రజస్వల చక్రం అసమానతలు, అండోత్పత్తిలో అంతరాయం, గర్భం ధరించే సామర్థ్యం తగ్గుదల వంటి సమస్యలకు దారి తీస్తుంది.

ఎలా వాడాలి..?ఈ రసాయనాల ప్రభావాన్ని తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా బాడీ స్ప్రేను నేరుగా చర్మంపై స్ప్రే చేయడం మానుకోవాలి. దాని బదులు దుస్తులపై మితంగా వాడితే చర్మం రసాయనాలతో నేరుగా తాకకుండా ఉంటుంది. అలాగే గర్భవతులు, హార్మోన్ సంబంధిత చికిత్సలు తీసుకుంటున్న వారు ఈ ఉత్పత్తుల వాడకంపై మరింత జాగ్రత్త వహించాలి.ప్రకృతిసిద్ధమైన ఎంపికలు..ఇవేవీ వాడకూడదనేది కాదు. కానీ ఎక్కువగా సహజ సుగంధాలు వాడే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.

తులసి, లవంగం, నిమ్మపండు వంటి సహజ సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే పెర్ఫ్యూమ్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాల నుండి రక్షణ ఇస్తాయి. వైద్య సలహా తప్పనిసరి..మీకు ఇప్పటికే హార్మోన్ సంబంధిత సమస్యలు ఉన్నా, లేదా సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నా, మీరు రోజూ వాడుతున్న ఉత్పత్తులలో ఏమైనా సమస్య ఉందేమో అని అనుమానించినట్లయితే వెంటనే వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *