పాము కాటు వేస్తే వెంటనే ఈ ఆకుతో ఇలా చేసి ప్రాణం నిలుపుకొంది, సంజీవనిలాంటి మొక్క గురించి తెలుసుకోకుంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

ప్రతిరోజు శివుడ్ని అభిషేకించే వారు. శివుడి పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించే వారి జోలికి కూడా పాములు అస్సలు పొవంట. అంతేకాకుండా.. పాములు నవనాగ స్తోత్రంను నిత్యం పఠించే వారి జోలికి, ప్రతి మంగళవారం జంట నాగులకు పాలతో అభిషేకం చేసే వారి జోలికి అస్సలు పోవంట. అయితే గతంలో అటవీ ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరివేవి. కానీ నేడు జనవాసాల్లోకి ఎక్కువగా సంచరిస్తున్నాయి. మీకు తెలిసిన వారు ఎవరైనా పాము కాటు వేస్తే ఎలాంటి కంగారుపడవద్దు.

వారిని ప్రశాంతంగా ఉంచాలి. ఆందోళన చెందకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాము కాటు విషాన్ని ఐదు నిమిషాల్లో శరీరంలోకి ఎక్కకుండా నియంత్రించాల్సి ఉంటుంది. శరీరంలోకి విషం చేరకపోతే ఎలాంటి ప్రాణాపాయం సంభవించదు. కొన్ని మొక్కలు పాము విషం శరీరం అంతటా వేగంగా వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా పొదల్లో కనిపించే ఒక ఆయుర్వేద మొక్క పాము విషాన్ని శరీరంలోకి వెళ్లకుండా నియంత్రిస్తుందని కొందరు చెబుతున్నారు.

ఆయుర్వేద మందులు, ఇతర మందులలో ఉపయోగించే ఈ మొక్క పాము కాటుకు అద్భుతంగా పని చేస్తుందని.. ఇతర విష జంతువుల కాటు నుంచి కూడా కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను సకాలంలో.. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఐదు నిమిషాల్లో పాము విషాన్ని నిర్వీర్యం చేస్తుంది. దీని ఆకులు, ఇతర భాగాల నుంచి తయారు చేసిన పొడి విషం ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. పాము కాటు నుంచి రక్షించే మొక్కను కాంక్రోల్, కండోలా లేదా కాట్రాల్ అని పిలుస్తారు.

ఈ మొక్క వేడి, తేమతో కూడిన ప్రాంతాలలో కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో బోడ కాకరకాయ మొక్కగా పిలుస్తారు. ఈ చెట్టుకు బుడ్డ కాకరకాయలు కాస్తాయి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ కాకరకాయను ఎంతో రుచికరంగా వండుకోవచ్చు. బోడ కాకరకాయ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. ఇతర కూరగాయల కంటే 50 శాతం ఎక్కువ ప్రోటీన్ బోడ కాకరకాయలో ఉంటుంది. అయితే ఈ బోడ కాకరకాయ ఆకులు పాముకాటుకు ఎలా నివారిస్తాయనేది ఇంకా ఆయుర్వేద నిపుణులు చెప్పలేదు. దీనిపై ఇంకా శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఇంకా ధ్రువీకరించలేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *