శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేసారో అంటే సంగతులు.

divyaamedia@gmail.com
2 Min Read

శీతాకాలం రోజుల్లో చాలా మందికి వారి ఆరోగ్య విషయంలో, రోజువారీ దినచర్యలో అనేక మార్పులు వస్తుంటాయి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వాటిలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ఒకటి. ఇది గుండె ఆరోగ్యానికి ఆందోళన కలిగిస్తుంది. అయితే శీతాకాలంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు శరీరం అనేక సంకేతాలను ఇస్తుంది. వీటిలో అలసట, ఛాతీలో భారంగా అనిపించడం, పెరిగిన దృఢత్వం లేదా నీరసం, శ్వాస ఆడకపోవడం వంటివి ఉన్నాయి.

వ్యాయామం లేదా కొద్దిగా శ్రమ తర్వాత కూడా చాలా మంది త్వరగా అలసిపోతారు. కొన్ని సందర్భాల్లో, వారు కాళ్ళలో నొప్పి, మెడ లేదా భుజాలలో బిగుతుగా ఉండటం, తలలో భారాన్ని అనుభవించవచ్చు. ఈ సంకేతాలు శరీరంలో కొవ్వు – కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని వెంటనే నియంత్రించాలి. శీతాకాలంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడానికి తేలికైన, పోషకమైన – ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరమని డాక్టర్ అజిత్ జైన్ వివరించారు.

ఓట్స్, గంజి – మల్టీగ్రెయిన్ తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఎందుకంటే ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బాదం – వాల్‌నట్స్ వంటి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి.. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అవిసె గింజలు, చియా – గుమ్మడికాయ గింజలు ఒమేగా-3 లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.. ఇంకా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

ఇక నూనె విషయంలో .. ఆలివ్ లేదా ఆవ నూనె మంచి ఎంపిక.. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసేందుకు ఇవి కూడా అవసరం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. జీవక్రియ చురుగ్గా ఉండటానికి తగినంత నీరు త్రాగాలి. తక్కువగా వేయించిన, తీపి ఆహారాలు తినండి. ఒత్తిడి నిర్వహణపై శ్రద్ధ వహించండి. మీ కొలెస్ట్రాల్ స్థాయిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. మీకు ఏమైనా సమస్యలుంటే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *