దావూద్ ఇబ్రహీంని మించి పోయిన లారెన్స్ బిష్ణోయ్, బిష్ణోయ్ తో పెట్టుకుంటే ఎంత డేంజరస్ అంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

సల్మాన్ ఖాన్కి ఆప్తమిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సల్మాన్ ఖాన్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నది? దీనికి అసలు కారణం.. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్లిన సమయంలో.. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడు. అయితే లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్నాడు. 2014లో అరెస్టై పదేళ్లుగా కారాగారవాసం చేస్తున్నాడు. అయితే జైల్లో ఉన్న ఖైదీ బయట ఇంత తతంగం ఎలా నడుపుతున్నాడని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జైల్లో లారెన్స్‌కి ప్రత్యేకంగా సెల్‌ఫోన్ కేటాయిస్తున్నారు.

ఈ ఫోన్ ద్వారానే అన్నింటినీ సెటిల్ చేస్తున్నాడు. ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం వీటికి మరింత బలం చేకూర్చింది. అలా పదేళ్లుగా జైలులో ఉంటూనే ఇంటర్నేషనల్ గ్యాంగ్‌ని తయారు చేశాడట. ప్రస్తుతం లారెన్స్ కింద దాదాపు 700 మంది షూటర్లు ఉన్నారట. వీరిని ప్రతి దేశంలో మోహరించి అసైన్‌మెంట్లు ఇస్తున్నాడని తెలిసింది. ఈ విధంగా 32 ఏళ్ల వయసులోనే మోస్ట్ నొటోరియస్ గ్యాంగ్‌స్టర్‌గా లారెన్స్ ఎదగడంతో దావూద్‌ని మించిపోయాడని అంటున్నారు. ప్రస్తుతం కెనడా, భారత్ మధ్య సంబంధాలు చెడిపోయాయి. దీనికి కారణం కూడా లారెన్స్ అనే అంటున్నారు. గతేడాది కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు.

ఈ హత్యను భారత స్పై ఏజెన్సీల కుట్రగా కెనడా ఆరోపించింది. భారత నిఘా సంస్థల అధికారులే లారెన్స్ బిష్ణోయ్‌కి కాంట్రాక్ట్ ఇచ్చి తన గ్యాంగ్‌తో హత్య చేయించారని ప్రచారం చేశారు. ఖలిస్థానీ వేర్పాటువాదుల మద్దతు, ఓట్ల కోసం ఈ ఆరోపణలకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా వంతపాడారు. కెనడియన్ల ప్రచారం పక్కన పెడితే.. లారెన్స్ బిష్ణోయ్ పేరు ఇందులో రావడమే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. వాస్తవానికి స్పై ఏజెంట్లు క్రిమినల్స్‌ని చంపడానికి మరికొందరు క్రిమినల్స్‌కే సుపారీ ఇస్తుంటారు. అలా లారెన్స్ బిష్ణోయ్‌కి ఇచ్చారంటే అతడికి ఇంటర్నేషనల్ వైడ్ నెట్‌వర్క్ ఉందని అధికారులకు కూడా తెలిసుండాలి.

లారెన్స్‌ని దేశభక్తుడిగా చూడాలా? అన్న కోణం కూడా ఉంది. అనధికారికంగా లారెన్స్ ప్రభుత్వ ఏజెంటుగా నియమించి ఉండొచ్చు. నిఘా వర్గాలు కూడా గ్యాంగ్‌స్టర్లనే నియమించుకుని తమ టార్గెట్‌ని ఫినిష్ చేస్తాయి. దావూద్ ఇబ్రహీం టైంలోనూ ఇలాగే చేశారు. కాబట్టి భారత వ్యతిరేకులను అంతం చేసే అసైన్‌మెంట్ లారెన్స్‌కి అప్పగించారా? అన్న అనుమానాలు లేకపోలేదు. గతంలోనూ తాను నిజమైన దేశభక్తుడినని లారెన్స్ ప్రకటించుకున్నాడు. ప్రో ఖలిస్థానీలు, పాకిస్థానీలంటే లారెన్స్‌కు అస్సలు పడదు. సోషల్ మీడియాలోనూ లారెన్స్‌ దేశభక్తికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. లారెన్స్‌ని హీరోగా చిత్రీకరిస్తుండటం గమనార్హం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *