ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు..! కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం. ఒక్కసారి సోకితేనే..?

divyaamedia@gmail.com
2 Min Read

ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్‌ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్‌ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధికారులు కొన్ని ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. కానీ, కొన్ని చోట్లా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో చనిపోయిన కోళ్లను మేతగా వేస్తున్న వీడియోలను కాకినాడకు చెందిన ఎన్జీవో సభ్యులు విడుదల చేశారు.

అయితే ఇప్పుడు కొవిడ్‌కి మించిన మరో ప్రాణాంతక మహమ్మారి మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే బర్డ్‌ఫ్లూ . ఇది అధిక మరణాల రేటుకి దారితీయొచ్చని, కొవిడ్ మహమ్మారి కన్నా 100 రెట్లు అధ్వాన్నంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూకు చెందిన H5N1 వేరియంట్ తొలుత ఆవులకు, ఆ తర్వాత ఓ కార్మికుడికి వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కేసును ఏప్రిల్ 1వ తేదీన ‘‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్షన్ (CDC)’’ ధృవీకరించింది.

ఈ వ్యాధి లక్షణాల్లో కళ్లు ఎర్రగా మారడం ఒకటి. ఆ కార్మికుడికి కూడా వ్యాధి సోకిన వెంటనే కళ్లు ఎర్రగా మారడంతో.. అతడిని ఐసోలేషన్‌కి తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, వైరస్ సోకిన వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ‘‘రోగిని ఒంటరిగా ఉంచాం. యాంటీవైరల్ డ్రగ్‌తో చికిత్స అందిస్తున్నాం’’ అని సీడీఎస్ తెలియజేసింది. కాగా.. ఓ వ్యక్తి బర్డ్‌ఫ్లూ బారిన పడటం ఇది మొదటిసారి కాదు. 2022లోనే అమెరికాలోని కొలరాడోలో తొలి కేసు నమోదైంది. పిట్స్‌బర్గ్‌లోని బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డా. సురేష్ కూచిపూడి మాట్లాడుతూ..

‘‘ఈ వైరస్ కొన్ని దశాబ్దాలుగా మహమ్మారి జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఇది మహమ్మారికి దారితీసే అత్యంత ప్రమాదకరస్థాయికి చేరువలో ఉన్నాం’’ అని చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ఇది కొవిడ్ కంటే 100 రెట్లు అధ్వాన్నంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవులకు క్రమంగా వ్యాప్తి చెందింతే.. మరణాల రేటు గణనీయంగా ఉంటుందని హెచ్చరించారు. అప్పుడు దానిని నియంత్రించడం కష్టతరమవుతుందని ఇతర నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలతో పాటు ఇతర చర్యలు తీసుకుంటే శ్రేయస్కరమని సలహా ఇస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *