కలల రాణి అభిమానులు ఒక హీరోయిన్ను ఫిక్సైయ్యారంటే కలల్లో ఎన్ని అరాచకాలు చేస్తారో మీ ఊహలకే వదిలేయవచ్చు. అందుకే, కమర్షియల్ హీరోకి సినిమాలో ఎంతటి ప్రాముఖ్యం ఉంటుందో హీరోయిన్‌కి అంత ప్రాముఖ్యం ఉంటుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆమె చాలా బొద్దుగా గుర్తుపట్టలేకుండా మారిపోయింది.
దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ అందాల రాణి బిపాసా బసు. బిపాసా బసు తల్లి గా ప్రమోషన్ పొంది సుమారు మూడేళ్లు గడిచాయి. ఈ మధ్యకాలంలో ఆమె ఎప్పుడూ బయట కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల ముంబైలో ఒక సామాన్యురాలిగా కనిపించింది బిపాసా.
ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా దర్శనమిచ్చింది. ఈ మేరకు బిపాసాకు సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట వైరలవుతోంది. ఈ క్లిప్‌లో, బిపాసా నల్లటి లెగ్గింగ్స్, నీలిరంగు టీ-షర్ట్, జిమ్ బ్యాగ్ ధరించి కారు వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లడం మనం చూడవచ్చు. అయితే ఆమెను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు సైజ్ జీరోతో కనిపించిన బిపాసా ఇప్పుడు ఇలా బొద్దుగా మారిపోయిందేంటి? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే తల్లయ్యాక ఇలా బరువు పెరగడం సహజమేనని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమిలేదంటున్నారు చాలామంది. అలాగే బరువు విషయాన్ని సాకుగా చూపి మహిళలను ఎగతాళి చేయకూడదని సూచిస్తున్నారు.