ఒకవైపు సినిమాలు, మరొకవైపు రియాలిటీ షోతో బిగ్ బాస్ పేరును మరింత పాపులర్ అయ్యేలా చేశారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ లో చేసే ఫన్నీ కామెంట్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే సల్మాన్ ఖాన్ ధరించే దుస్తులు కూడా అట్రాక్షన్ గా కనిపిస్తాయి. అందుకే టిఆర్పి రేటింగ్ కూడా భారీగా రావడంతో సల్మాన్ ఖాన్ కి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటారు బిగ్ బాస్ నిర్వాహకులు.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ మద్యం తాగి హోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఈ షోలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా అతని ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించింది. కళ్లు కూడా వాచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన చాలా మంది సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని విమర్శించారు.
అయితే దీనిని సల్మాన్ అభిమానులు ఖండిస్తున్నారు. ఈ మేరకు సల్మాన్ బిహేవియర్ పై ఓ క్లారిటీ కూడా ఇస్తున్నారు. కాగా మహాభారత్ హిందీ సీరియల్‌లో నటించిన పంకజ్ ధీర్ ఇటీవలే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆ తర్వాత రియాద్ వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్, షారుఖ్ ఖాన్‌లతో పాటు సల్మాన్ ఖాన్ వేదికను పంచుకున్నారు.
ఆ తర్వాత, అక్కడి నుంచి నేరుగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు వచ్చాడు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్రపోలేదు. అందుకే అతని కళ్ళు ఉబ్బిపోయాయి. నిద్ర లేకపోవడం వల్ల అతను సరిగ్గా నిలబడలేకపోయాడు కూడా. ఈ క్రమంలోనే కొంతమంది సల్మాన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు.
Just spit on haters face 😤#SalmanKhan #SalmanKhan𓃵 #BiggBoss19 #BiggBoss @BeingSalmanKhan pic.twitter.com/89idsYYe4i
— ℝ𝕚𝕗𝕒𝕥 𝕤𝕒𝕝𝕞𝕒𝕟𝕚𝕒𝕔🗿 (@Being_Rifat) October 23, 2025
