కంటెస్టెంట్స్ ఎమోషన్తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో.. వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మరోసారి రీతూ చౌదరికి, సంజనకు మధ్య గొడవైందని తెలుస్తుంది.
గతవారం సంజన నోరు జారీ అన్న మాటలకూ రీతూ తెగ ఏడ్చేసింది. అలాగే సంజన కూడా ఎక్కడా తగ్గలేదు. అవసరమైతే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆతర్వాత హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం అనే హౌస్ లోనే కొనసాగింది. ఇక నేడు నామినేషన్స్ లోనూ మరోసారి సంజనకు, రీతూకి గొడవ జరిగింది.
మరోసారి అదే పాయింట్ తో సంజను నామినేట్ చేసింది రీతూ.. ఆతర్వాత తనూజ ఇమ్మానుయేల్ ను నామినేట్ చేసింది.”నాకేమైనా అనిపిస్తే నా మైండ్‌లో ఏమైనా తిరుగుతుంటే నేను షేర్ చేసుకోవాలి.. వాడితోనే చెప్పుకున్నా.. ఎందుకంటే వాడే కదా నా ఫ్రెండ్.. అంటూ తనూజ ఎమోషనల్ అయ్యింది.
ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు.. “నువ్వు నాతో ఎంత ట్రూగా ఉన్నావో నేను నీ విషయంలో కూడా అంతే ట్రూగా ఉన్నాను.. అది నీకు ఎందుకు తెలీలేదో నాకు అర్ధంకావడంలేదు.. అదే నన్ను హర్ట్ చేసింది.. నువ్వు నా ఫ్రెండే కాదురా అనేశావ్ నా ముఖం మీద.. తనూజ నువ్వు ఏమైనా అంటే దాన్ని నుంచి బయటికి రావడానికి నాకు టైమ్ పడుతుంది.. ప్లీజ్ మన ఇద్దరకీ గొడవలు వద్దనే చెప్పాను నీకు ఆరోజు కూడా చెప్పాను.. అంటూ ఇమ్మాన్యుయేల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
కానీ ఎప్పటికీ చెప్తా నువ్వు నా ఫ్రెండే.. అంటూ తనూజ అంది. ఆతర్వాత ట్విస్ట్ ఇచ్చింది. ఇక నా ఫస్ట్ నామినేషన్ డీమన్ పవన్ అని చెప్పింది. అదేంటి ఇప్పటివరకు జోక్ చేశావా.? అని డీమన్ అనగానే.. అది జోకో, గీకో బిగ్ బాస్ చెప్తాడు అని తనూజ రివర్స్ అయ్యింది.
