గత రెండు వారాలు కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ మధ్య చిచ్చు పెట్టి గొడవలతో రచ్చ చేసిన బిగ్బాస్ ఇప్పుడు హౌస్ మెంబర్స్ సీక్రెట్స్ బయటపెట్టే పని స్టార్ట్ చేశాడు. అలాగే ఎమోషనల్ కంటెంట్ పై ఫోకస్ పెట్టాడు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ తో ముచ్చట పెడుతూ బిజీగా ఉండిపోయింది రీతూ. అయితే మొదటి వారం నుంచి బిగ్ బాస్ హౌస్ లో ప్రియా శెట్టి, శ్రీజ పై ఆడియన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు.
హౌస్ లో వీరి ప్రవర్తన.. చేసే పంచాయితీలు చూసి ప్రేక్షకులకు చిరాకు వచ్చింది. ఎప్పుడెప్పుడు ప్రియా, శ్రీజ నామినేషన్స్ లో ఉంటారా ఎలిమినేట్ చేసి బయటకు పంపించేద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ నుంచి శ్రీజ తప్పించుకోవడంతో ఇప్పుడు ప్రియా ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇప్పటికే ఓటింగ్ లో ప్రియా లీస్ట్ లో ఉంది. ఫ్లోరా షైనీ ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. లక్స్ పాపకు ప్రేక్షకులు ఓట్లు గట్టిగానే గుద్దుతున్నారు. ఫ్లోరా తర్వాత రాము రాథోడ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఆతర్వాత హరిత హరీష్, కళ్యాణ్, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. వీరందరి కంటే చివరిలో ఉంది ప్రియ శెట్టి.
శుక్రవారం వరకు సమయం ఉండటంతో మరి ప్రియా గట్టెక్కుతుందో లేదో చూడాలి. కానీ ప్రియ ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.