బిగ్బాస్.. గత సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా వైల్డ్ కార్ట్ ఎంట్రీలు ఉండనున్నాయి. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారుని తెలుస్తోది. వారి పేర్లు కూడా సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ‘ఈ వారం మీరంతా నామినేట్ అయ్యారు, ఈ నామినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందే అవకాశం మీకు ఇస్తున్నాను, మీరంతా ఆ బెడ్ మీదనే ఉండాలి, అలా ఆఖరి వరకు ఎవరెవరు ఉంటారో, వాళ్లు నామినేషన్ నుంచి బయటపడినట్టు. మిగిలిన వాళ్లు నామినేట్ అయ్యినట్టు’ అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు.

ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నారు. చివరకు ఈ గేమ్ లో ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్యాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజనా, దివ్య నికితా, ఫ్లోరా, రితూ చౌదరి, శ్రీజ, పవన్, భరణి, డిమాన్ పవన్, తనూజ, సుమన్ లు ఈ వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు.
అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా ఈ వారమే హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే శ్రీజ, దివ్యా నికిలా, రీతూ చౌదరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దివ్య నికితా గేమ్స్ బాగానే ఆడుతోంది. తోటి కంటెస్టెంట్స్ తో కూడా సవ్యంగానే మెలుగుతోంది.
అయితే ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ కావడంతో సరైన ఫ్యాన్ బేస్ లేదు. దీంతో దివ్యకు ఓటింగ్ లో దెబ్బ పడుతోంది. ఇక గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకుంది దమ్ము శ్రీజ. కాబట్టి ఆమె కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం రీతూ చౌదరి, పవన్ లకు ఓటింగ్ తక్కువగా ఉంది. మరి వీరిలో ఈ వారం బయటకు వస్తారో చూడాలి.
Unseen Bigg Boss! Laughs everywhere, drama everywhere! 💥😂
— Starmaa (@StarMaa) October 6, 2025
Watch #BiggBossTelugu9 UnSeen Extra Cuts Mon–Fri 10:30 PM, on #StarMaa pic.twitter.com/UFz6jL4rh6