బిగ్ బాస్ బాగోతం బట్టబయలు, బాత్ రూమ్ లో సీక్రెట్ మైక్స్, కెమెరాలు కనిపెట్టిన కంటెస్టెంట్.

divyaamedia@gmail.com
2 Min Read

సీజన్ 8 లోగో ఇదే. బిగ్‌బాస్ 8తో ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాం.” అని నాగార్జున అన్నారు.కాగా ఈ బిగ్‌బాస్ సీజన్ 8 లోగో కలర్‌ఫుల్ డిజైన్‌తో చాలామందిని ఆకట్టుకుంది. ఈ లోగోలోని నంబర్ 8 డిజైన్ ఇన్ఫినిట్ సింబల్ లాగా ఉంది. లోగో మధ్యలో ఓ ఫ్లవర్ మొత్తం లుక్కును మరింత అందంగా మార్చింది. అయితే సీజన్ 6లో కంటెస్టెంట్ చేసిన ఆదిరెడ్డి లేటెస్ట్ వీడియోలో బిగ్ బాస్ హౌస్ ని ఉద్దేశించి మాట్లాడాడు. ఆ ఇంటికి సంబంచింది మనకు తెలియని రహస్యాలు బయటపెట్టాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్.

ఆదిరెడ్డి ప్రకారం… షో మొదలు కావడానికి ఒక నెల రోజుల ముందే బిగ్ బాస్ హౌస్ నిర్మాణం పూర్తి చేస్తారట. ఈ నెల రోజులు ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారట. ఎలాంటి లోపాలు ఉన్నా… వాటిని సరి చేస్తారట. ఇంత వరకు మనకు తెలియని విషయం ఏమిటంటే… బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్ మైక్స్, కెమెరాలు ప్రతి చోటా ఉంటాయట. చివరికి బిగ్ బాస్ హౌస్ బాత్ రూమ్ లో కూడా సీక్రెట్ మైక్స్ ఉంటాయట. కంటెస్టెంట్స్ బాత్ రూమ్స్ కి వెళ్లే ముందు మైక్ బయట పెట్టి పోతారు.

అక్కడ ఏం మాట్లాడినా బిగ్ బాస్ నిర్వాహకులకు వినపడదు అనుకుంటే పొరపాటేనట. బాత్ రూమ్ లో మాట్లాడినా వారు సీక్రెట్ మైక్స్ ద్వారా వింటారట. మైక్స్ బ్యాటరీస్ తో పని చేస్తాయి. బ్యాటరీస్ ఛార్జ్ అయిపోతే స్టోర్ రూమ్ కి వెళ్లి మారుస్తారు. బ్యాటరీస్ తీసేసినప్పుడు మైక్ పని చేయడం లేదని కంటెస్టెంట్స్ నోరు జారతారు. కానీ సీక్రెట్ మైక్స్ వారి మాటలను రికార్డు చేస్తాయట.

మైక్స్ వలె హౌస్ మొత్తం సీక్రెట్ కెమెరాలు ఉంటాయట. కాబట్టి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఆచితూచి మాట్లాడాలి. వారి ప్రతి మూమెంట్ ని, కామెంట్స్ ని వారు గమనిస్తూనే ఉంటారట. ఆదిరెడ్డి చెప్పిన ఈ విషయాలు సంచలనం రేపుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ డిజైన్ కూడా కంటెస్టెంట్స్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందట. మల్టీ కలర్స్ తో కూడిన హౌస్ విసుగు, అసహనం కలిగేలా చేస్తాయనే ఓ వాదన ఉంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *