ప్రస్తుతం హౌస్ లో ఏడు కంటెస్టెంట్స్ ఉన్నారు.తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్-5 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఒకవేళ టాప్-5 ని తీసుకుంటే ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కోసం మిడ్ వీక్ ఎలిమినేషన్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ కు దగ్గరగా కళ్యాణ్ పడాల, తనూజ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నారు. కామన్ మెన్ కోటా నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. మొదట్లో నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. కానీ నెమ్మదిగా తన ఆట తీరును మార్చుకుంటూ విన్నర్ ఇతడే అనేలా చేశాడు. కానీ కళ్యాణ్ ఆట ఇప్పుడు దారి తప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం తనూజ కోసమే గేమ్ ఆడుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే విషయాన్ని అటు భరణి సైతం బ్లాస్ట్ అయ్యాడు.

అయితే ముందు సీజన్ 9 విన్నర్ తనూజ అని టాక్ చక్కర్లు కొడుతుంది. జనాల ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ టాప్ ప్లేస్ లో ఉండగా… తనూజ రెండో స్థానంలో ఉంది. కానీ ప్రేక్షకుల లెక్కలు కాకుండా బిగ్ బాస్ ఓటింగ్ అంటే మాత్రం తూజ విన్నర్ కావడం ఖాయమని అంటున్నారు. ఈ సీజన్ మొదటి నుంచి తనూజకు ఎక్కువగా సపోర్ట్ ఉందని.. ఆమె తప్పు చేసినా తనకే మద్దతు తెలుపుతున్నారని నెటిజన్స్ వాపోతున్నారు. నిజానికి తనూజ ఫిజికల్ టాస్కులలో అంతగా పోటీపడింది లేదు.
ఆమె కంటే డీమాన్ పవన్, కళ్యాణ్, భరణి, రీతూ చౌదరి ఫిజికల్ టాస్కులలో అదరగొట్టేశారు. కానీ విన్నర్ మాత్రం తనూజ అంటూ నెట్టింట జోరుగా నడుస్తుంది. మరోవైపు ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ముందే ఫిక్స్ అయ్యారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందరూ ఊహించినట్లుగా తనూజ, కళ్యాణ్ కాకుండా ఈసారి ఇమ్మాన్యుయేల్ విన్నర్ కాబోతున్నాడని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు అతడినే ఫైనల్ చేశారని అంటున్నారు.
దీంతో నెట్టింట అడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయితే.. మరీ షో చూడడం ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
