బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ ఎవరికీ ఎంతో తెలుసా..? ఎక్కువ ఎవరికో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

బిగ్​బాస్ సీజన్ 9లో కామనర్స్, సెలబ్రెటీలను ఉంచి గేమ్​ని ఇంట్రెస్టింగ్​ మార్చాడు బిగ్​బాస్. అయితే కంటెస్టెంట్లు అంత బజ్​ క్రియేట్ చేయలేకపోతున్నారు కానీ.. వారితో భిన్నంగా ఆడుకునేందుకు బిగ్​బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరొకసారి అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేసింది.

ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదవ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో గొడవలు షురూ అయ్యాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతుంటుంది? అలా ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు?

కామనర్స్ పారితోషికాలు ఎలా ఉన్నాయి? అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి? అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగరీలో హౌస్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు రూ.15,000 నుండీ రూ.20,000 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.

అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి రూ. 70,000 ఇవ్వనున్నారన్నమాట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయేల్ కు వారానికి రూ.2,50,000లు, శ్రేష్టి వర్మ, రాము రాథోడ్ లకు వారానికి రూ.2,00,000లు ఇవ్వనున్నారట. ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగు పెట్టిన తనూజ, రీతు చౌదరీ, సుమన్ శెట్టి లకు వారానికి రూ.2,75,000, నటి ఫ్లోరా శైనీకి రూ.3,00,000లు ఇస్తున్నారట.

ఇక హౌస్ లో అత్యధిక పారితోషకం అందుకుంటోన్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతనికి వారానికి సుమారు రూ.3,50,000లు ముట్టజెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *