తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. అలా ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్ కూడా మొదలై మరింత కొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికి ఆశించిన దానికంటే ఎక్కువ రేటింగ్ వస్తోంది. దీంతో మరిన్ని సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ప్లాన్ చేస్తూ నిర్వహకులు ఈ సీజన్‌ను మరింత రంజుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హౌస్‌లో తరచూ వాగ్వాదాలు, గొడవలతో బాగా హైలెట్ అయిన ఆమె నాలుగో వారంలోనే బయటికి వచ్చేసింది.
దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసిగెత్తిపోయారు. దీంతో నాలుగో వారంలో నామినేషన్స్ లిస్టులో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ కారణంగా బయటకు వచ్చేసింది. అయితే, బిగ్‍బాస్ హౌస్‍లో నాలుగు వారాలు ఉన్న సోనియాకు మంచి రెమ్యూనరేషన్ అందిందని సమాచారం. సీజన్ ప్రారంభమవ్వడానికి ముందే పారితోషకానికి సంబంధించి కాంట్రాక్టు జరిగిందని సమాచారం.
దీని ప్రకారం రోజుకు రూ.28 వేల చొప్పున ఒక్కో వారానికి రూ. 2 లక్షల రెమ్యునరేషన్ దక్కేలా సోనియా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిందట. ఆ లెక్కన మొత్తం నాలుగు వారాలకు గానూ సోనియా మొత్తం రూ. 8 లక్షలు అందుకుందని సమాచారం. కాగా మోడల్‍గా కెరీర్ ఆరంభించిన సోనియా 2019లో జార్జి రెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది.
ఆ తర్వాత డైరెక్టర్ రామ్‍గోపాల్ మూవీ కరోనా వైరస్ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో సోనియా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఆశా ఎన్‍కౌంటర్ చిత్రంలోనూ నటించింది. ఇదే క్రేజ్ తో బిగ్‍బాస్ హౌస్‍లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు. అయితే, నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.