భానుప్రియ క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఒక డాన్స్ స్కూల్ కూడా పెడదామని అనుకున్నారు. కానీ, ఐదేళ్ల క్రితం భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ కన్నుమూయడంతో ఆమె కాస్త విషాదంలో కూరుకుపోయారు. ఆ తరవాత కొన్నాళ్ల నుంచి తనకు ఆరోగ్యం బాగుండడం లేదని.. మెమరీ లాస్‌తో బాధపడుతున్నానని భానుప్రియ చెప్పారు. ఒకప్పటి అందాల తార, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, అందగత్తె భానుప్రియ తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషలలో 150కి పైగా చిత్రాలలో నటించిన ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంతో కూడా మంత్రముగ్ధులను చేసింది.
1994లో విడుదలైన రవిచంద్రన్ నటించిన ‘రసిక’ చిత్రం చూసిన వారికి ముద్దుమొహం నాయిక భానుప్రియ జ్ఞాపకం మరువలేము. ఆ తర్వాత ‘దేవర మగ’, ‘సింహాద్రి సింహ’, ‘కదంబ’, ‘మేష్ట్రు’ వంటి చిత్రాలలో నటించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన భానుప్రియ నృత్యానికి ఫిదా కానీ వారు లేరు. ఇప్పుడు 58 ఏళ్ళు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోయారు. నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది. దశాబ్దాలుగా బహుభాషా చిత్రాలలో కనిపించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు.

90లలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ అభిమానులు కొంతకాలం ఆందోళన చెందారు. కానీ ఏ రంగమైనా అంతే కదా? ప్రస్తుతం ఉన్నప్పుడు అభిమానం, ఇంకా ఏవేవో కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నా తర్వాత వారి గురించి మర్చిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. భానుప్రియ గురించి ప్రజలు మర్చిపోయారు. 1998లో భానుప్రియ సినిమాటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. 2005లో విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నటి, మేమిద్దరం బాగున్నాం. కొన్ని కారణాల వల్ల వేర్వేరు చోట్ల నివసిస్తున్నాం అంతే. విడాకులు ఏమీ కాలేదు.
విడాకుల వార్త కూడా అబద్ధం అన్నారు. కానీ 2018 భానుప్రియ జీవితంలో అతిపెద్ద షాక్‌గా మారింది. ఆమె భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించారు. భర్త మరణం తర్వాత నటి భానుప్రియ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే బాధతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన నటి, ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి, భర్త మరణం తర్వాత నేను సినిమాలలో నటించడం తగ్గించాను. ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు. ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది. ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా ఇప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుతోంది అని నటి చెప్పుకున్నారు.