అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు నందు మెహ్రా అతి చిన్నవయసులోనే కన్ను మూసారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక భానుశ్రీ మెహ్రా సోదరుడు నందు మరణించి ఏడు రోజులు అవుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తన మొదటి సినిమాతోనే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో భాను శ్రీ మెహ్రా కూడా ఒకరు.. ఈమె అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఈమె కెరియర్ లో సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
సుమారుగా తన కెరియర్లో 15కు పైగా చిత్రాలలో నటించిన భాను శ్రీ మెహ్రా మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలోకి బచానే హసీనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా భాను శ్రీ మెహ్రా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. భాను శ్రీ మెహ్రా సోదరుడు నందు గడిచిన ఏడు రోజుల క్రితం మరణించారట.. తన తమ్ముడు అనారోగ్య సమస్యతో మరణించారని అతనిని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు భాను శ్రీ.. ఈ మేరకు ఒక పోస్ట్ షేర్ చేసింది భాను శ్రీ మెహ్రా.. అయితే ఈ విషయం విన్న అభిమానులు సైతం ఒకసారిగా ఆశ్చర్యపోయారు.
టాలీవుడ్ హీరోయిన్ ఇంట ఇంతటి విషాద ఛాయలు ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఎవరికీ తెలియదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. భాను శ్రీ మెహ్రా తన సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు గురించి ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ తన తమ్ముడు మరణించి ఇప్పటికీ ఏడు రోజులు అయింది ఇది పీడకల అయితే బాగుండు అని తెలిపింది. ఈ నిజాన్ని ఎలా నమ్మాలి.. నువ్వు గుర్తుకు వస్తున్నావు.. నువ్వు లేవని ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.
తన మనసులో ఎప్పటికీ తనకు చోటు ఉంటుంది.. ఐ మిస్ యు నందు అంటూ భాను శ్రీ మెహ్రా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తమ కుటుంబంతో కలిసి తన తమ్ముడు ఎంజాయ్ చేసిన సన్నివేశాలను, ఫోటోలను సైతం కొన్నిటిని షేర్ చేసింది భాను శ్రీ మెహ్రా. ఈ విషయం విన్న అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ భానుశ్రీకి ధైర్యం చెబుతున్నారు.