ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ‘ఆడపిల్ల’ అనే సీరియల్‌తో సమీరా షరీఫ్ తెలుగు బుల్లితెరపైకి వచ్చింది. హీరోయిన్‌గా మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయిన ఆమె.. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘భార్యమణి’, ‘మూడు ముళ్ల బంధం’, ‘ప్రతిబింబం’, ‘మంగమ్మ గారి మనవరాలు’తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించింది. తద్వారా స్టార్‌గా ఎదిగింది. అయితే యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్ అమ్మగా తన గొప్ప మనసును చాటుకుంది.
ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె NICU (నియో నాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) శిశువుల కోసం 6 లీటర్లకు పైగా తల్లిపాలను భద్రపర్చింది. అది కూడా కేవలం ఒక నెల రోజుల్లోనే. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల యాంకరమ్మ. ఇప్పుడే కాదు ఇక ముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లి పాలను డొనేట్ చేస్తానంటూ ఒక అందమైన వీడియోను ఇన్‌స్టాలో షేర్ పంచుకుంది.
‘కేవలం ఒక నెల రోజుల్లోనే అల్లా, నేను, నా బిడ్డ సయ్యద్ అమీర్ ఇది సాధించాం. ఇకముందు కూడా శిశువులకు తల్లి పాలను డొనేట్ చేస్తాం. దీనివలన తల్లులకు ఎలాంటి నష్టం జరగదు. ఇది పెద్ద కష్టమేమీ కాదు. మీ బాడీ మీద, మీమీద, మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి, విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. బాగా తినండి. నీళ్లు బాగా తాగండి.
బాగా సంతోషంగా ఉండండి. ఎంత ఎక్కువగా పాలు ఇస్తే..అంత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మాతృమూర్తులు భయపడాల్సిన అవసరం లేదు’ అని తల్లులకు భరోసా ఇచ్చింది సమీరా.