తన గేమ్‌తో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతుందనుకున్న క్రమంలోనే ఫస్ట్ ఎలిమినేషన్లో బయటికి వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్, కెరీర్ విషయాలను చెప్పుకొస్తుంది. అలా… అమెరికాలో ఉండే తాను.. కొన్నాళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చానని చెబుతూ.. తన చదువు జాబ్స్ గురించి షాకింగ్ విషయాలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది ఈలేడీ.
అయితే సింగర్ గా, సోషల్ మీడియా రీల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న బెజవాడ బేబక్క అలియాస్ మధు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. బేబక్క అమెరికాలో ఉంటుందని, అమెరికా నుంచి వచ్చిందని తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బేబక్క మాట్లాడుతూ తన చదువు, జాబ్స్ గురించి చెప్పింది. బేబక్క మాట్లాడుతూ.. నేను స్కూల్, కాలేజీ అన్ని విజయవాడలోనే చదివాను. మంచి స్టూడెంట్ నే.
MBA చేశాను, యూనివర్సిటీ టాపర్ కూడా. లెక్చరర్ గా ఆఫర్ వచ్చింది. కానీ అమెరికా వెళ్లాలని ఆ జాబ్ వదిలేసుకొని వెళ్ళాను. అమెరికాలో దాదాపు పదేళ్లు జాబ్ చేశాను. నేను పనిచేసే సంస్థలో నేనే యంగెస్ట్ టెస్ట్ లీడ్. ఆల్మోస్ట్ కోటి రూపాయల జీతం, నాకే హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చారు అని తెలిపింది. అయితే కావాల్సినంత సంపాదించేసాను అని, డబ్బుల కోసం అమెరికా వెళ్ళాను అని, సంపాదించాక ఇప్పుడు ప్యాషన్ కోసం ఇటు వచ్చానని తెలిపింది.
అందుకే బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఒప్పుకొని వచ్చేసాను అని తెలిపింది. కోటి రూపాయల జీతం జాబ్ వదిలేసుకొని సింగింగ్, యాక్టింగ్ ప్యాషన్ తో అమెరికా వదిలేసి వచ్చానని బేబక్క చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.