సాయి పల్లవి.. సౌందర్యలాంటి సీనియర్ హీరోయిన్ల తరహాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో అయితే లేడీ పవర్ స్టార్ అనే రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించడం చిన్న విషయమేమీ కాదు. ఇలాంటి సాయి పల్లవి తాజాగా బికినీలో దర్శనమివ్వడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. అయితే ఆస్ట్రేలియాలోని బీచ్‌లో జలక్రీడలు ఆడుతూ బికినీలో కనిపించిన సాయి పల్లవి ఫోటోలు పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఆమెను బికినీలో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరు సాయి పల్లవి బికినీలో నమ్మబుద్ధి కావట్లేదు అని కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఇది ఏఐ ఫోటో కావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇవి నిజమైనవే, తన సిస్టర్ పూజా కన్నన్ అధికారికంగా పోస్ట్ చేసినవి. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి.
కొందరు అభిమానులు షాక్ అయ్యి పద్ధతికి చిరునామాగా ఉండే సాయి ఇలా మారిపోయిందా అని అన్నారు. మరికొందరు మద్దతుగా నిలిచి ఇది ఆమె వ్యక్తిగత జీవితం. వెకేషన్‌లో తనకు నచ్చినట్టు దుస్తులు వేసుకోవడంలో తప్పు లేదు అని చెప్పారు. టాలీవుడ్‌లో సావిత్రి, సౌందర్య లాంటి నటీమణుల తర్వాత పద్ధతికి చిరునామాగా సాయి పల్లవిని చూస్తారు. కానీ ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కొందరు సూచిస్తున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో భారీ చిత్రం రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. మొదటి భాగం బడ్జెట్ 835 కోట్లు, మొత్తం రెండు భాగాలకు 4000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని వార్తలు. ఈ మూవీ 2026లో విడుదల కానుంది.