మూత్రం నిజానికి ఆరోగ్యకరమని పరిశోధకులు తెలియజేస్తున్నప్పటికీ మనం వెళ్లే మూత్రంలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ యూరియా వంటి పోషకాలు ఉంటాయట. ఇందులో ఉండే బ్యాక్టీరియా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మన శరీరం పైన మూత్ర విసర్జన చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవు. అయితే స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేయడం హానికరం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. చాలా అధ్యయనాలు ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నాయి.
ముఖ్యంగా మహిళలకు. స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేయడం మహిళలకు మరింత హానికరం.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక నివేదిక ప్రకారం.. స్నానం చేసేటప్పుడు శరీరంపై నీరు పోసుకుంటే, శరీరంలోని సానుభూతి నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీనివల్ల శరీరంలో రక్తపోటు పెరిగి, కిడ్నీలు బిపిని నార్మల్‌గా ఉంచడానికి ద్రవాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియను ఇమ్మర్షన్ డ్యూరెసిస్ అంటారు. ఈ సమయంలో బ్లాడర్ వేగంగా నిండుతుంది.
ఫలితంగా బ్లాడర్ పై ఒత్తిడి పెరిగి మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంది. మరో అధ్యయనం ప్రకారం.. ప్రవహించే నీటి శబ్దం కూడా మూత్ర విసర్జన చేయాలనిపించేలా చేస్తుందట. కొన్ని అధ్యయనాల ప్రకారం, స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా పబ్లిక్ బాత్రుమ్స్ లో. మూత్రంలో అనేక రకాల బాక్టీరియా, ఇతర హానికరమైన పదార్థాలు ఉంటాయి, ఇవి చర్మంతో ప్రత్యక్ష సంబంధంలోకి వస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే ఒక వ్యక్తి స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా స్త్రీల మూత్రనాళం చిన్నదిగా ఉండడంతో పాటు మూత్రాశయంలోకి బ్యాక్టీరియా చేరడం సులువు అవుతుంది. స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జనకు దూరంగా ఉండాలి.