Bank Loan: ఏ బ్యాంక్ నుంచైనా లోన్ తీసుకొని EMI కట్టలేని వారికి గుడ్ న్యూస్.
Bank Loan: జీతం డబ్బు ఖర్చయిపోయి, ఎమర్జెన్సీగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. అనుకోని ప్రమాదాలు ఏర్పటినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీల సమయంలో ఈ లోన్స్ ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అయితే వ్యక్తిగతంగా ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా.. సడన్ గా ఏమైనా జరిగినా చాలా మంది డబ్బుల కోసం బ్యాంకుల ఆశ్రయిస్తారు. అక్కడ పర్సనల్ లోన్ లాంటివి ఇస్తారు. ఇది ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ తక్కువ ఉంటే.. అక్కడకు వెళ్లి బ్యాంక్ లోన్ తీసుకుంటారు. తర్వాత నెల వారీగా ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
Also Read: అరచేతిలో దురదగా ఉంటే, మీకు నిజంగానే డబ్బు వస్తుందా..? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది.
అయితే ఒక్కో సమయంలో కుటుంబ ఆర్థిక సమస్య కారణంగా లోన్ తీసుకున్న మొత్తానికి లోన్ EMI చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు. లేదా మరేదైనా సమస్య కారణంగా ఈఎంఐ చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది.. దీనికి ఏమైన సమస్యలు ఏర్పడతాయా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. బ్యాంక్ లేదా ఇతర ఫైనాన్స్ కంపెనీల నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఇచ్చిన మొత్తం చెల్లించేందుకు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల కూడా మనం తప్పకుండా EMI చెల్లించాలి. దీని ద్వారా రుణం మొత్తం చెల్లించడంతో పాటు.. మన సిబిల్ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. కానీ మీరు EMI చెల్లించడం మానేస్తే.. మీకు సమస్యలు మొదలవుతాయి.
అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలసిన కొన్ని చట్టపరమైన అంశాలు ఏంటో ఇక్కడ తెలుసుకోంది.మీరు ఈఎంఐ చెల్లించడంలో విఫలం అయితే.. జైలు శిక్ష అనుభవించే అంత నేరం కాదు. చెక్ బౌన్స్ లో మాత్రం ఆ వ్యక్తి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్ విషయంలో ఇలాంటివి ఉండవు. మీ యొక్క ఆస్తులు కూడా వేలానికి వస్తాయనే భయం కూడా అవసరం లేదు. అసలు చట్టం ఏం చెబుతోందంటే.. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. లోన్ EMI చెల్లించని ఏ వ్యక్తి కూడా వారికి కాల్ చేసి బెదిరించకూడదని గైడ్ లైన్స్ లో ఉంది. ముందుగా లోన్ ఇచ్చిన బ్యాంక్ వరుసగా రెండు లేదా మూడు ఈఎంఐలు చెల్లించకపోతే.. ఒక నోటీస్ జారీ చేయాలి.
Also Read: భారతీయులకు శుభవార్త, వీసా అవసరం లేకుండా కొత్తగా మరో 6 దేశాలకు వెళ్ళొచ్చు.
అందులో వివరంగా పొందుపరుస్తారు. అప్పులు వసూలు చేసేవారు కస్టమర్లకు భంగం కలిగించకూడదు. వారితో మర్యాదగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బుల చెల్లించలేని పక్షాన ఆస్తి వేలం వేసే సమయంలో వారిని సంప్రదించాలి. వారి అంగీకారంతోనే వేలం వేస్తారు. ఏదైనా సమస్య కారణంగా మీరు లోన్ EMI చెల్లించలేకపోతే.. మీరు దాని గురించి బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడవచ్చు.. లోన్ కాలపరిమితిని పొడిగించమని లేదా మరేదైనా పరిష్కారం కోసం అడగవచ్చు. బ్యాంకులు కూడా అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నియమాలను మీరు దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ లోన్ కి వెళ్లండి.