మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేసి తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

బంగాళదుంపలను నిల్వ చేసే ప్రదేశం చాలా ముఖ్యం. వీటిని ఎప్పుడూ చల్లగా, గాలి ఆడే ప్రదేశంలో, తక్కువ వెలుతురున్న ప్రదేశంలో ఉంచడం మంచిది. ఎక్కువ చలిలో నిల్వ చేస్తే అంటే ఫ్రిజ్‌లో ఉంచితే బంగాళదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. దీని వలన రుచి మారిపోతుంది. వండినప్పుడు అసలు అనుకున్నటువంటి ఫ్లేవర్ రాదు. అలాగే తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచితే ఇవి త్వరగా పాడైపోతాయి. అయితే ఆలుగడ్డల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే దీన్ని నూనెలో వేయించి తినొద్దు.

ఉడకబెట్టి తీసుకోవడం మంచిది. బంగాళదుంపలతో వివిధ వంటకాలను తయారు చేయవచ్చు. బంగాళదుంపలను సాంబార్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు ఉపయోగిస్తారు. బంగాళదుంపలను మార్కెట్ నుండి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. బంగాళదుంపలు కొని ఇంటికి తెచ్చిన తర్వాత వెంటనే వాడకపోతే కొన్ని రోజులకు మొలకెత్తుతాయి. అయితే చాలా మంది ఈ మొలకలను తొలగించి వంటల్లో వాడుతుంటారు. అయితే బెంగళూరుకు చెందిన డాక్టర్ దీపక్ ఆరాధ్య మాత్రం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

అవును, మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే మొలకెత్తిన లేదా లేత ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. ఇది వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి కారణమవుతాయి. అంతేకాకుండా ఇది తలనొప్పి, తల తిరగడం వంటి నరాల సంబంధిత లక్షణాలను కూడా కలిగిస్తుందని డాక్టర్ దీపక్ చెబుతున్నారు. కాబట్టి ఇకపై ఇంట్లో నిల్వ ఉన్న బంగాళా దుంపలను వంట చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాడటం మంచిది. లేదంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *